E-Paper
Advertisement

chatgpt for HR department : హెచ్‌ఆర్ ఉద్యోగులు.. చాట్‌జీపీటీపైనే భారం వేస్తున్నారు..!

chatgpt for HR department  : హెచ్‌ఆర్ ఉద్యోగులు.. చాట్‌జీపీటీపైనే భారం వేస్తున్నారు..!
Advertisement
chatgpt for HR department

chatgpt for HR department : చాట్‌జీపీటీ.. ఈ టెక్నాలజీ గురించి అందరికీ పూర్తిగా అవగాహన లేకపోయినా.. దీని గురించి వినని వారు మాత్రం చాలా తక్కువే ఉంటారు. ఇప్పుడు ఏ రంగంలో చూసినా చాట్‌జీపీటీ హవా నడుస్తోంది. కొన్ని రంగాల్లో ఇది మంచిది కాదని, విద్యార్థులను ఇది తప్పుదోవ పట్టిస్తుందని.. ఇలా దీనిపై ఎన్నో ఆరోపణలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా చాట్‌జీపీటీ యూజర్లు ముందుకెళ్తున్నారు. తాజాగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ చాట్‌జీపీటీపై ఎక్కువగా ఎవరు ఆధారపడతారో తెలిసింది.

Advertisement

సాఫ్ట్‌వేర్ అంటేనే టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉండే రంగం. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీలు అన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగించే రంగంగా సాఫ్ట్‌వేర్‌కు పేరుంది. అలాగే చాట్‌జీపీటీని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో హెచ్‌ఆర్ ఉద్యోగులు.. కావాల్సిన దానికంటే ఎక్కువగానే చాట్‌జీపీటీపైన ఆధారపడుతున్నారని తెలిసింది. ట్రైనింగ్, సర్వేలు, పర్ఫార్మెన్స్ రివ్యూలు, రిక్రూటింగ్.. ఇలా ఎన్నో టాస్కులకు పూర్తిగా చాట్‌జీపీటీపై ఆధారపడి ఉన్నారని రిపోర్ట్ చెప్తోంది.

10 హెచ్‌ఆర్ ఉద్యోగుల్లో ఒకరు కచ్చితంగా చాట్‌జీపీటీపై ఎక్కువగా ఆధారపడుతున్నారని రిపోర్టులో తేలింది. కానీ దానిని ఒప్పుకోవడానికి మాత్రం వారు సిద్ధంగా ఉండరని తెలుస్తోంది. ఈ రిపోర్ట్ కోసం 213 టెక్ హెచ్ఆర్ ఉద్యోగులను, 792 టెక్ ఉద్యోగులను ఎంపిక చేసుకొని వారి ఉద్యోగ అనుభవాల గురించి చెప్పమన్నారు. అంతే కాకుండా ఈ రిపోర్ట్ ద్వారా తేలిన విషయం ఏంటంటే.. హెచ్ఆర్ ఉద్యోగులు చాట్‌జీపీటీని ఉపయోగించి పనులు చేసుకోవడం వల్ల వారంలో 70 నిమిషాలు సేవ్ చేసుకుంటున్నారు.

Advertisement

ఏఐ, చాట్‌జీపీటీతో పాటు హెచ్‌ఆర్ ఉద్యోగులకు ఎక్కువగా ఉపయోగపడుతున్న టెక్నాలజీలు పేరోల్ సాఫ్ట్‌వేర్, బ్యాక్‌గ్రౌండ్ సాఫ్ట్‌వేర్, హెచ్ఆర్ అనాలటిక్స్, రిపోర్టింగ్, టైమ్ అండ్ అటెండెన్స్ సిస్టమ్స్. చాట్‌జీపీటీ కాకుండా హెచ్ఆర్ ఉద్యోగులు ఎక్కువగా ఆధారపడుతుంది ఈ టెక్నాలజీలపైనే అని రిపోర్ట్‌లో తేలింది. చాట్‌జీపీటీపైనే ఆధారపడి పనిచేస్తున్నారు కాబట్టి స్టార్టప్ సంస్థలు కూడా తక్కువమంది ఉద్యోగులను హైర్ చేసుకునే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే సాఫ్ట్‌వేర్‌లోనే కాదు.. ఎన్నో ఇతర రంగాల్లో కూడా ఉద్యోగుల స్థానంలో చాట్‌జీపీటీ పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×