Podarillu Today Episode November 16th : కన్నా నీ నారాయణని కలిపేందుకు ఏదో ప్లాన్ చేస్తానన్నారు ఏం ప్లాన్ చేశారు.. ఎక్కడ ప్లాన్ చేశారు అని మహాలక్ష్మి చక్రిని లోపలికి తీసుకుని వెళ్లి అడుగుతుంది. అయితే మహాలక్ష్మి చక్రి చేయి పట్టుకుని లోపలికి వెళ్తూ ఉండదా అది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ త్వరలోనే కలిసిపోతారు అని నాకు అనిపిస్తుంది అని కేశవ మాధవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక నారాయణ కూడా చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసిపోతే శాశ్వతంగా మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది అని సంతోషంగా ఉంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి తన చెయ్యి పట్టుకుని వెళుతుంది అని అలా చూస్తూ తన వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా కేశవ కి ఫోన్ రావడంతో తను కూడా పక్కకు వెళ్ళిపోతాడు ఇక మాధవ్ మనిషా ఇద్దరు కూడా వంట గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు.
మనిషా వంట చేశారా అని అడుగుతుంది నాకు ఏమి అనిపించట్లేదు కదా లోపలికి వెళ్దామని మాతో తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. అటు కేశవా శైలు తో ఫోన్ మాట్లాడుతూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక కన్నా ఒక్కడే బయట ఉండి బాంబులు కాల్చేందుకు రెడీ అవుతూ ఉంటాడు అది చూసిన నారాయణ కాస్త జాగ్రత్తగా కాలవమని ఎంత చెప్పినా సరే అసలు వినకుండా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని కన్నా తండ్రిని అవమానించేలా మాట్లాడుతాడు.. ఇక కన్నా నీ ఇష్టం మంచిగా జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పాను అంతే తప్ప నువ్వు ఇలా అంటావ్ అని నేను అసలు అనుకోలేదు అని నారాయణ ఇక చూస్తూ ఉండిపోతాడు.. ఇక అందరూ జంటలుగా వెళ్లి మాట్లాడుకుంటూ ఉండగా కన్న ఒక్కడే అందరిని పట్టించుకోకుండా బాంబుల మీద ఇష్టంతో వాటిని కాల్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అయితే మహాలక్ష్మి కన్నా ని మీ నాన్నని కలపడానికి ఏదో ప్లాన్ చేస్తానని అన్నారు కదా.. ఏం ప్లాన్ అది అని అడుగుతాడు. అసలేం ప్లాన్ చేశారు చెప్పండి అని చెప్పగానే చక్రి ఆ ప్లాన్ గురించి చెప్తాడు అది విన్న మహాలక్ష్మి ఇది ఒక ప్లాను దీనికోసం మేము మళ్ళీ వెయిట్ చేయాలా దేనికన్నా నేను ఏదైనా మంచి ప్లాన్ చేసింది ఏంటి బాగుండేది . మీ మట్టితో ఇలాంటి ప్లాన్ చేస్తారని అస్సలు ఊహించలేదు అని తిడుతుంది. అసలు ఏమనుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు అని చక్రిని మహాలక్ష్మి తిడుతుంది.. ఇక తర్వాత చక్రి చేసేదంతా ఇలానే ఉంటది 50% ఆఫర్ లాగే ఉంది. ఇది కూడా అని మహాలక్ష్మి అనగానే చాలా ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్లిద్దరూ కలపడానికి ఈ దీపావళి పండుగని వాడుకుందాం అని అనుకున్నాను.. కానీ మీకు చెప్పాను కదా అది ఇలానే ఉంటుంది. ఏదో ఒకటి నేనే చేస్తానని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది.
ఇక కన్నా బాంబులు పేలుస్తూ ఉండగా నారాయణ చూసి మురిసిపోతూ ఉంటాడు. అయితే కన్నా బాంబులు పెట్టదని ఇప్పుడు గాలికి ఆ బాంబులు రివర్స్ గా పడిపోతాయి. అయితే ఆ బాంబుల నీ కన్నా వరకే రావడంతో కన్నా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ గట్టిగా అరిచేస్తాడు. కానీ అది చూసి నన్ను నారాయణ కన్నా ని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు తన ప్రాణాలకు తెగించి ఆ బాంబులకి అడ్డుగా నిలబడతాడు. అది చూస్తున్న అందరూ కన్నా అంటూ అరుస్తూ వెళ్తారు.. నారాయణ మాత్రం బాంబులికి అడ్డుపడి కన్నాని తన కౌగిలిలో బంధించి మరి కాపాడతాడు. అయితే అందరూ కూడా అది చూసి కన్నాకి ఏమైంది అని కంగారు పడిపోతూ ఉంటారు కానీ నారాయణకు మాత్రం బాంబులు ఒళ్లంతా కాలడంతో అందరూ అతన్ని తిడుతూ ఉంటారు.. ఇక తర్వాత తెగించాడు ప్రాణాలను కూడా పక్కనపెట్టి నారాయణ కన్నాని కాపాడాడు అని అందరూ కూడా తనని పొగిడేస్తూ ఉంటారు అంతేకాదు తనకి బాగా కాలింది అని బాధ పడిపోతూ ఉంటారు..
మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని తన పని చేసుకుంటూ బిజీగా ఉండగా తనకి ఏదో డౌట్ వచ్చిందని దగ్గరికి వెళ్తుంది అయితే విక్కీ తనకి దేశంలోని ఖరీదైన పెర్ఫ్యూమ్ని తెచ్చేస్తాడు కానీ తన మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇలాంటి గిఫ్ట్లు నాకొద్దు అని అంటుంది.. ఇక విక్కీ తనని ప్రేమిస్తున్నాడని మహాలక్ష్మికి అర్థమయ్యేటట్టు కనిపిస్తుంది.. ఇక లాయరు ఏంటమ్మా మీరిద్దరు విడాకులు తీసుకుని రాలేదా అని లాయర్ అడుగుతాడు. అయితే నేను కచ్చితంగా విడాకులు తీసుకుంటాను అని అంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం చక్రితో విడిపోవాలి అంటే భయపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..