Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ను కలవాలని జ్యోత్స్న ఫోన్ అడుగుతుంది. అందుకు సూరజ్ ఓకే అంటాడు. వాళ్లు రెగ్యులర్ గా కలుసుకునే ప్లేస్‌కు రమ్మని చెప్తుంది జ్యోత్స్న. సూరజ్ వెళ్తాడు. రమ్మనగానే వచ్చినందుకు థాంక్స్ అంటుంది జ్యోత్స్న అసలు నన్ను ఎందుకు కలవాలనుకున్నావో అది చెప్పు అంటూ సూరజ్ అడిగితే.. నిజాలు చెప్పడానికి అంటూ జ్యోత్స్న అంటుంది. అవన్నీ ఎప్పుడో విన్నాను కదా మీ గ్రానీ చెప్పింది కదా అంటే నువ్వు విన్నవన్నీ నిజాలు కావు అంటుంది జ్యోత్స్న.. మరి నిజం ఏంటో ఆస్థి కోసమే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నది నిజం కాదా అంటూ సూరజ్ ప్రశ్నిస్తే.. నిజమే అంటుంది జ్యోత్స్న.
సూరజ్ షాక్ అవుతాడు. అప్పుడే జరిగిందంతా చెప్తుంది జ్యోత్స్న మొదటి నుంచి తమకు పరిచయం అయినప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్తుంది. నన్నే రిజెక్ట్ చేస్తాడా..? అంటూ అహంతో నీతో గొడవ పడ్డాను అప్పుడే నీతోనే ప్రేమలో పడిపోయాను. అంటూ తాను దీపతో మాట్లాడిన విషయాలు చెప్తుంది. నేనేనా ఇలా మారిపోయింది అనుకున్నాను.. ఆస్థి ఉంటే చాలు అనుకునే స్థితి నుంచి సూరజ్ ఉంటే చాలు నేను బతకడానికి అనే పరిస్థితికి వచ్చాను అంటూ మొత్తం చెప్తూ ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. తన ప్రేమ మోసం కాదని తాను ప్రేమించడం నిజమని సూరజ్ కోసమే బతుకుతున్నది నిజం అంటూ ఏడుస్తుంది. తన కోసం తాను ఎప్పుడూ ఏడవలేదని.. కానీ సూరజ్ కోసం ఏడిచానని బాధపడుతుంది జ్యోత్స్న. అందుకు సూరజ్ కోపంగా తనను నమ్మించడానికే నువ్వు ఇదంతా చెప్తున్నావని ఎందుకు అనుకోకూడదు అంటూ ప్రశ్నిస్తాడు.
నీకు నచ్చింది నువ్వు అనుకో నేను అనుకున్నది నువ్వు అనుకో అని చెప్పడానికి రాలేదు అంటూ జ్యోత్స్న చెబితే అయితే నేను చెప్పేది విను నీ ప్రేమ కూడా అబద్దమే ఇది కూడా నీ మోసంలో ఒక భాగమే. నేను నీ వెంట తిరిగి నీ ఫ్యామిలీ మీద పగ తీర్చుకున్నట్టే.. నువ్వు నా వెంట తిరిగి నా ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవని ఏంటి గ్యారెంటీ..? అందులో భాగంగానే నా తల్లి దగ్గరకు నీ గ్రానిని పంపించి డబ్బులు తీసుకున్నావు అంటూ సూరజ్ తిడుతుంటే.. జ్యోత్స్న ఏడుస్తూ.. నువ్వు ఏదైనా అబద్దం అను నా ప్రేమను మాత్రం అబద్దం అని అనకు ప్రేమించి మోసం చేసింది నువ్వు నేను కాదు. పగ కోసం మంచి వాడిలా నటించింది నువ్వు నేను కాదు అంటూ జ్యోత్స్న అంటుంది. సూరజ్ మాత్రం తన జేబులో ఉన్న తాళి తీసి జ్యోత్స్న చేతిలో పెట్టి అన్ని తిరిగి ఇచ్చేస్తున్నాను ఇక బై అంటూ వెళ్లబోతుంటే.. వెళ్లిపోయే ముందు ఒక్కమాట నేను నీకోసమే బతుకుతున్నాను.. చచ్చినా నీకోసమే చస్తాను అంటూ వెళ్లిపోతుంటే.. సూరజ్ అలాగే నిలబడి చూస్తుంటాడు.
అప్పుడే మాలని పంపించిన కిరాయి రౌడీ జ్యోత్స్నను గన్‌తో కాల్చబోతుంటే.. సూరజ్ అడ్డుపడతాడు. బుల్లెట్ సూరజ్‌కు తగిలి కింద పడిపోతాడు. జ్యోత్స్న సూరజ్‌ను పట్టుకుని ఏడుస్తుంది. సూరజ్ అంటూ గట్టిగా అరుస్తుంది. నిన్ను చావనివ్వను నా ప్రాణాలు పోసైనా నిన్ను కాపాడుకుంటాను అంటూ సూరజ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. హాస్పిటల్‌కు కార్తీక్, దీప వెళ్తారు. జరిగింది మొత్తం జ్యోత్స్న చెప్తుంది. డాక్టర్ వచ్చి వెంటనే ఆపరేషన్ చేయాలని సూరజ్ ది రేర్ బ్లడ్ గ్రూప్ అని మా హాస్పిటల్‌లో లేదని వీలైనంత త్వరగా బ్లడ్ అరైంజ్ చేయండి అంటాడు. డోనర్ కోసం కార్తీక్, దీప, జ్యోత్స్న ప్రయత్నిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.