BigTV English

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Suryapet Crime: సూర్యాపేట నడి రోడ్డుపై షాకింగ్ ఘటన జరిగింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను కొందరు దుండగులు కారులో వెంబడించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వైరల్‌గా మారింది.


ఏం జరిగింది.?
సూర్యాపేట నగరంలో నడి రోడ్డుపై బైక్‌పై ముగ్గురు.. ఒక వ్యక్తి ఇద్దరు మహిళలు వెళుతున్నారు. ఇంతలో వారిని వెంబడిస్తూ ఒక కారు రోడ్డుపై వచ్చింది. వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. దారిపై కారులు వెళుతుందని బైక్ సైడ్ చేసిన కారు మాత్రం వారినే వెంబడిస్తూ ముందుకు సాగుతుంది. రాను రాను బైక్‌ను వెంబడిస్తున్న కారు స్పీడ్ పెరగింది. దీంతో బైక్ పై వున్న వారు భయాందోళనకు గురయ్యారు కారులో వున్న వారి చేతుల్లో కత్తు ఉండటంతో బైక్ పై వెళుతున్న ముగ్గురు షాక్ కు గురయ్యారు. వెంటనే రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాప్ కనిపించడంతో బైక్ వదిలి అందులో పరుగులు పెట్టారు. అది చూసిన కారులో వెళుతున్న వారు కారు పక్కకు ఆపి వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే వైన్ షాపులో ఉన్న వారు బయటకు రావడంతో వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడే వున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Also Read: Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!


బైక్ పై వెళుతున్న ముగ్గురిని వెంబడించిన వారు ఎవరు? ఎందుకు వెంబడించారు. వీరిద్దరి మధ్య ఏమైనా ఆస్తి తగాదాలు వున్నాయా? లేక బంధువులే వీరిపై దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. కారులో వున్న వ్యక్తులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ సహాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బైక్ పై వెళుతున్న వారిపై అటాక్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని రోడ్డుపై ఎవరూ లేని సమయంలో ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులు అదృష్టవశాత్తు వైన్ షాపులో పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై ఆరా తీస్తున్న పోలీసులు కారులో వెంబడించిన వారు సూర్యాపేటకు చెందిన వారా? లేక వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Heavy Rains: భారీ వర్షాలు.. మరో మూడు రోజులు దంచుడే దంచుడు..

Ponnam And Adluri Comments: ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం..

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Telangana politics: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఈసారికి అలా ముందుకు

Ponnam Prabhakar: వివాదానికి ఫుల్‌స్టాప్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

Big Stories

×