BigTV English

Adi Purush :- ఆది పురుష్ ఆడియో రిలీజ్ డేట్‌, ప్లేస్ ఫిక్స్

Adi Purush :- ఆది పురుష్ ఆడియో రిలీజ్ డేట్‌, ప్లేస్ ఫిక్స్


Adi Purush :- ఆది పురుష్ ఆడియో రిలీజ్ డేట్‌, ప్లేస్ ఫిక్స్…


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా వ‌రుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్టుల‌ను సిద్ధం చేస్తున్నారు. అందులో ముందుగా ఆది పురుష్ రిలీజ్ కానుంది. జూన్ 16న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. భార‌త ఇతిహాసం రామాయ‌ణంను ఆది పురుష్గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వీఎఫ్ఎక్స్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోందీ చిత్రం. రాముడు పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. సీత దేవిగా కృతి స‌న‌న్ న‌టిస్తుంది. లంకాధీశుడుగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఈ సినిమాను జ‌న‌వ‌రి సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ వి.ఎఫ్.ఎక్స్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌భాస్‌ను ఎంతో అభిమానించే ఆయ‌న అభిమానులు సైతం ఆది పురుష్ ఔట్ పుట్ చూసి పెద‌వి విరిచారు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు మూవీ రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేసి, వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నుల‌పై ప్ర‌త్యేక‌మైన ఫోక‌స్ చేసి మార్పులు చేర్పులు చేసి జూన్ 16న రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ఫిక్స్ చేసిన‌ట్లు సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు తిరుప‌తి ఎస్‌.వి.యూనివ‌ర్సిటీ గ్రౌండ్‌లో జూన్ 3న ఆది పురుష్ ఆడియోను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథిగా విచ్చేస్తార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. టి సిరీస్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్ నిర్మాత భూష‌ణ్ కుమార్ ఆది పురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భారీ బ‌డ్జెట్ ఖ‌ర్చు పెట్టారు. ప్ర‌భాస్ రెమ్యూన‌రేష‌న్ వంద కోట్ల‌కు పైగా అని వార్త‌లు కూడా వ‌చ్చాయి. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ఆది పురుష్ సినిమాను నిర్మించారు. మ‌రి ఇప్పుడు అయినా సినిమాపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెబుతారో లేదో మేక‌ర్స్ తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×