E-Paper
Advertisement

Cabinet Expansion: హస్తం పార్టీలో భారీ స్కెచ్.. కొత్త మంత్రుల జాబితా ఇదే!

Cabinet Expansion: హస్తం పార్టీలో భారీ స్కెచ్.. కొత్త మంత్రుల జాబితా ఇదే!
Advertisement

Cabinet Expansion: తెలంగాణ కాబినెట్ నుండి ఔట్ అయ్యేది ఎవరు..??కాబినెట్ లోకి కొత్తగా వచ్చేది ఎవరు..? అధికార కాంగ్రెస్ పార్టీ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకీ కాబినెట్ విస్తరణ ఉంటుందా? మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే ఉంటాయనే పార్టీ వర్గాలు నమ్మకంగా చెప్తున్నాయి. మరి శాఖల మార్పు జరిగేది ఎవరికి? కాబినెట్ నుండి బయటికి వెళ్ళేది ఎవరు? …. కొత్తగా అమాత్య పదవులు ఎవరిని విరిస్తాయి? అసలు మార్పులు చేర్పులతో కాబినెట్ విస్తరణ జరిగేదెప్పుడు?

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..?

మార్పులు చేర్పులతో కూడిన తెలంగాణ కాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరరైందన్న ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. విస్తరణతో పాటు కొందరు మంత్రులకు టాటా చెప్తారని. అలాగే కొందరు మంత్రుల శాఖల్లో సైతం మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాల అంటున్నాయి.

రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..?

Advertisement

మంత్రుల పనితీరు, సామాజిక వర్గాల సమతుల్యత, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఈ మూడు అంశాలను ప్రామాణికంగా చేసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో తెలంగాణ కాబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు చెప్పిన్నట్లు సమాచారం. దీంతో మంత్రులుగా ఎవరికి అవకాశం వస్తుందో, ఎవరిని పక్కన పెడతారోనని గాంధీ భవన్లో హాట్ హాట్ డిస్కషన్లు మొదలయ్యాయి.

మంత్రి పదవుల కోసం పోటీ హీట్

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది. మరో 8 నెలలైతే మూడేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఐతే ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు.. సామాజిక సమీకరణాలు కుదరక పోవడం, పోటీ అధికంగా ఉండడం, ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం ఇలా పలు కారణాలతో మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేకపోయిన్నట్లు టాక్. కాబినెట్ లో మొత్తం సిఏం ని కలుపుకొని 18 మందికి మంత్రి పదవులు ఇవ్వాలి. ప్రస్తుతం క్యాబినెట్లో 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశముంది.

ముగ్గురికి ఔట్ సంకేతాలు..?

Advertisement

ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ముగ్గురిని పక్కన పెట్టి, మొత్తం ఐదు మందికి మంత్రి పదవులు ఇవ్వాలని అధిస్థానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండుసార్లు విస్తరణ జరిగింది ఇందులో నలుగురికి మంత్రి గా అవకాశం దక్కింది.అయితే మొదట మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 12 మందిలో ముగ్గుర్ని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది.

ముగ్గురు మంత్రులపై రెడ్ ఫ్లాగ్

మొదటి 12 మంది మంత్రుల్లో ముగ్గురిపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ నియమావళికి కట్టుబడకపోవడం, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకపోవడం, నియోజక వర్గాలల్లో వర్గపోరు పెంచి పోషించడం, వ్యక్తిగత లబ్ది కోసం పని చేయడం లాంటి విమర్శలు కొందరు మంత్రులపై గట్టిగా వినిపిస్తున్నాయట. మంత్రులు వారికిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఏఐసీసీ వద్ద రిపోర్ట్ ఉందని, దాని ఆధారంగానే ముగ్గురు మంత్రులను పదవుల నుంచి తప్పిస్తారని హస్తం పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం పై ఇప్పటికే అధిష్టానం పెద్దలు సీఎం, పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులతో మాట్లాడిన్నట్లు టాక్.

ఎవరు ఇన్, ఎవరు ఔట్?

కాబినెట్ నుంచి పక్కన పెట్టనున్న మంత్రులు ఎవరై ఉంటారని పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందట. ఃఆ ముగ్గురు మంత్రులకు పార్టీ పెద్దలు ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు తమని మంత్రివర్గం నుండి తొలగిస్తున్నామని చెప్పడంతోనే సదరు మంత్రులు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారంట. ఈ ముగ్గురిలో ఒక్కరు మొదటిసారి మంత్రి కాగా… మరో ఇద్దరు గతంలో మంత్రులుగా చేసినవారే అంటున్నారు. వారిలో ఒక బీసీ, ఇద్దరు ఓసీ సామాజికవర్గాల వారని టాక్ వినిపిస్తోంది. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు ఉహగానాలు చెక్కర్లు కొడుతున్నాయట.

కొత్త కేబినెట్ బెర్త్‌లు.. లక్కీ లీడర్స్ ఎవరు..?

ఐతే కాబినెట్ నుండి ముగ్గురికి టాటా చెప్పడం తో పాటు…మంత్రివర్గంలో ని కొందరు మంత్రుల శాఖల మార్పులు కూడా ఉంటాయని సమాచారం. అంతర్గత ఇబ్బందులు తలెత్తకుండా లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే శాఖల మార్పు నిర్ణయం తీసుకున్నామని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. మంత్రి వర్గంలో వారికి ఇచ్చిన శాఖలపై ఎవరు పట్టు సాధించారు? ఎవరు తమ శాఖలకు న్యాయం చేశారు? తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రుల శాఖలను మార్పు చేస్తున్నట్లు సమాచారం. ఇక శాఖల మార్పులపై సైతం మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొత్తగా క్యాబినెట్ బెర్త్‌లు దక్కించుకునే లక్కీ లీడర్స్ ఎవరో చూడాలి.

Also Read: ప్రకాశం జనసేనలో ‘మూడు ముక్కల’ రాజకీయం.. త్వరలో రాబోయే ముప్పు ఇదేనా?

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×