E-Paper
Advertisement

బీజేపీకి అంత సీన్ లేదు.. యూడీఎఫ్‌దే విజయం, కోవలం రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీకి అంత సీన్ లేదు.. యూడీఎఫ్‌దే విజయం, కోవలం రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Kerala Assembly Election 2026: దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.  కేరళంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. యూడీఎఫ్ తరపున కేరళంలో ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

కేరళంలో వేడెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. 

Advertisement

కేరళంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఇవాళ ఆ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కోవలం, మావేలిక్కర, పతనపురం నియోజకవర్గాల్లో రోడ్‌షోలులో పాల్గొంటున్నారు. కోవలంలో యూడీఎఫ్ అభ్యర్థి ఎం.విన్సెంట్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కేరళంలో బీజేపీ అడుగుపెట్టే పరిస్థితి లేదన్నారు. కేరళం ప్రజలు మోదీ బ్రదర్స్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని అక్కడి ఓటర్లకు పిలుపు నిచ్చారు. ఢిల్లీలో ఒక మోదీ ఉంటే.. తిరువనంతపురంలో మరో మోదీ ఉన్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ-ఎల్‌డీఎఫ్ ఒక్కటేనని అన్నారు.

Advertisement

కోవలం రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి.. యూడీఎఫ్‌దే విజయమని వ్యాఖ్య

ఆ రెండు పార్టీలు ఒకటి కావడంతో గోల్డ్ కేసులో ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కు మోదీ గాడ్‌ఫాదర్‌గా వర్ణించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా యూడీఎఫ్ అధికారంలోకి రానుందని కుండబద్దలు కొట్ఠేశారు.  రేవంత్ ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన్ని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఈనెల 9న కేరళం శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా అధికార ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నాయి ఎన్నికల సర్వేలు. రెండు కూటములు మెజారిటీ మార్కుకు దగ్గరలో ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ నామమాత్రంగా ఉన్నట్లు తేలింది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మూడోసారి అధికారాన్ని చేపట్టాలని ఆశిస్తోంది.

ALSO READ: తమిళనాడు ఎన్నికల బరిలో లాటరీ కింగ్ భార్య లీమా రోజ్, ఆస్తులు రూ.5 వేల కోట్లకుపైనే 

యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 74 సీట్లు రావచ్చని, ఎల్‌డీఎఫ్ 70 లోపు రావచ్చని జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 71 సీట్లు అవసరం. రాజధాని తిరువనంతపురం సిటీలో ముక్కోణపు పోటీ నెలకొందని అంటున్నారు.  అక్కడి కార్పొరేషన్ పదవిని బీజేపీ దక్కించుకున్న విషయం తెల్సిందే.

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×