OTT Movies : మరో వారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. థియేటర్లలో కూడా ఈనెల చివరిలో కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వినాయక చవితికి ఎప్పుడు స్టార్ హీరోలో సినిమాలు పోటీ పడేవి.. అని ఇప్పుడు మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవని తెలుస్తుంది.. ‘సుందరకాండ’, ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘అర్జున్ చక్రవర్తి’, ‘కన్యాకుమారి’ లాంటి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అలాగే జాన్వీ ‘పరమ్ సుందరి’ కూడా ఇదే వీకెండ్‌లో బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. గత వారం రిలీజ్ అయిన కూలీ, వార్ 2 చిత్రాలు నిరాశపరిచాయి. ఇక సినీ అభిమానులు సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోలు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.
ఓటీటీలోకీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. మూవీ లవర్స్ కి ఈ వారం పండగే అని తెలుస్తుంది.. ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. మెట్రో ఇన్ డైనో అనే హిందీ మూవీ ఆసక్తి రేపుతోంది. వీటితో పాటు అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సిరీస్ లు కాస్త ప్రేక్షకులను ఆకట్టుకోనేలా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్న సినిమాలు, ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
అమెజాన్ ప్రైమ్..
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) – ఆగస్టు 29
హాట్‌స్టార్..
మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 25
పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) – ఆగస్టు 26
థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 27
డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 28
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28
హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – ఆగస్టు 29
నెట్‌ఫ్లిక్స్..
అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 26
క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) – ఆగస్టు 27
కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 27
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 28
ద థర్స్‌డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 28
మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) – ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 29
అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 29
కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – ఆగస్టు 30
జీ5..
సోదా (కన్నడ సిరీస్) – ఆగస్టు 29
సోనీ లివ్..
సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) – ఆగస్టు 29
సన్ నెక్స్ట్
మాయకూతు (తమిళ సినిమా) – ఆగస్టు 27
గెవి (తమిళ మూవీ) – ఆగస్టు 27
ఆహా..
ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) – ఆగస్టు 29
లయన్స్ గేట్ ప్లే..
బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 29
ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
ఆపిల్ ప్లస్ టీవీ..
క్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 29
ఎమ్ఎక్స్ ప్లేయర్..
హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) – ఆగస్టు 27
Also Read: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..
గతవారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువగా సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. మూవీ లవర్స్ కి ఈ వినాయక చవితి సినిమాలతో నిండిపోతుంది. ఇక వచ్చేవారం పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే సెప్టెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలు కూడా ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాల కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. మరి సెప్టెంబర్ లో ఏ సినిమా సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి..