Jr NTR War 2 Losses: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డేనే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలో వచ్చిన వార్ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా వచ్చిన వార్ 2పై ఓ రేంజ్‌లో బజ్ నెలకొంది. బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగం అవ్వడంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వార్‌ని మించి సీక్వెల్ హిట్ అవుతుందని మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశించారు.
ఫస్ట్ డే భారీ ఒపెనింగ్స్..
అలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ డే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది. కానీ, మిక్స్‌డ్ టాక్ కారణంగా వార్ 2కి వసూళ్లు క్రమంగా తగ్గాయి. దీంతో బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లు సాధిస్తుందని ఆశపడ్డ ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అన్నట్టు ఉంది. చివరికి వార్ 2 నిర్మాతలకు నష్టాలు మిగిల్చేలా ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంతకి వార్ 2 కలెక్షన్స్ ఎంత? బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఎన్ని కోట్లు చేయాలో చూద్దాం. ప్రస్తుతం వార్ 2 థియేటర్లలో రన్ అవుతోంది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాలు లేకపోవడంతో వార్ 2, కూలీలు థియేటర్‌లో ఇప్పటికీ రన్ అవుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి.
వార్ 2 బిజినెస్ లెక్కలు..
దీంతో కూలీ, వార్ 2 చిత్రాలకు కలెక్షన్ల దెబ్బ పడింది. ఒకటికొటి పోటీ పడతాయనుకుంటే.. రెండు డీలా పడ్డాయి. కానీ, ఇందులో వార్ 2కే కాస్తా బజ్ ఎక్కువగా ఉందని చెప్పాలి. అలా ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీసు బాగానే సందడి చేస్తుంది. అలా ఇప్పటి వరకు వార్ 2 ఇండియా వైడ్‌గా రూ. 220 కోట్లు నెట్ వసూళ్లు రాగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 290 కోట్ల నుంచి రూ. 300 కోట్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు రూ. 90 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ. నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 18 కోట్లు, ఆంధ్రలో రూ. 36 కోట్లు బిజినెస్ చేసింది. నార్త్‌లో రూ. 150 కోట్ల రాబట్టగా.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 23 కోట్లు బిజినెస్ చేసింది. ఇక ఓవర్సిస్‌లో వార్ 2 బిజినెస్ రూ. 102 కోట్ల మేర చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.
విడుదలకు ముందు మొత్తం రూ. 365 మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం బాగా కష్టపడుతోంది. మూవీ విడుదలైన రెండు వారాలు అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 300 కోట్లు మాత్రమే రాబట్టింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 370 కోట్లపైనే చేయాల్సింది ఉంది. అంటే ఇంకా ఈ సినిమా రూ. 70 కోట్లు రాబట్టాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మూవీకి పెద్దగా బజ్ లేకపోవడంతో బాక్సాఫీసు కలెక్షన్స్ అంతమాత్రంగానే వస్తున్నాయి. నిన్న వీకెండ్ ఆదివారం కావడంతో వార్ 2 వరల్డ్ వైడ్‌గా రూ. 6.5 కోట్ల మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మూడో వీక్‌లోకి అడుగుపెట్టింది.
Also Read: Kollam Thulasi: నటుడి దీనస్థితి.. భార్య, కూతురు ఛీ కొట్టారు.. అనాథలా ఆశ్రమంలో..
నష్టం రూ.70 కోట్లు
సోమవారం ఈ మూవీ కలెక్షన్స్ ఆశించిన మేరక వచ్చేలా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే మరికొన్ని రోజుల్లోనే వార్ 2 థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటుంది. అరకోర కలెక్షన్స్‌తో వార్ 2 మరో రూ.70 కోట్లు రాబట్టడమే సాధ్యమేనా అనిపిస్తుంది. దీంతో వార్ 2 మూవీ నష్టాలతో ముగుస్తుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నాయి. అదే జరిగితే నిర్మాతలకు వార్ 2 వల్ల రూ. 70 కోట్ల నష్టం వచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా పుంజుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా నష్టాలతోనే థియేటర్ల నుంచి బయటకు వస్తుందా చూడాలి. స్పై, యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను యష్ రాజ్ చోప్రా ఫిల్మ్ (YRF Film Banner) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.