OTT Movie : డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఓటీటీలో సంస్థలు పోటీ పడి దక్కించుకుంటున్నాయి. సరికొత్త కంటెంట్ తో ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక ఇరానియన్-అమెరికన్ కుటుంబం జీవితాన్ని, ముఖ్యంగా తల్లి-కూతురు సంబంధంలోని విభేదాలను ఎమోషనల్ గా చూపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. అందుకని ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలలోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
లీలా ఒక ఇరానియన్ యువతి. ఒక అమెరికన్ రచయిత్రి కూడా. అంతేకాకుండా ఆమె సినీ నిర్మాతగా కూడా ఉంటుంది. తన ఇరానియన్ సంస్కృతి, అమెరికన్ లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమెకు తన తల్లి షిరీన్ తో విభేదాలు వస్తాయి. ఎందుకంటే లీలా సినీ ఫీల్డ్ లో ఉండటం షిరీన్ కు నచ్చదు. లీలా ఒక హాలోవీన్ పార్టీలో మాక్సిమిలియన్ అనే నటుడితో ఒక రాత్రి గడుపుతుంది. దీని ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. అదే సమయంలో, ఆమె తండ్రి అలీ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఆసుపత్రిలో ఉండటంతో, లీలా కుటుంబం న్యూయార్క్‌లో సమావేశమవుతుంది. ఈ సమావేశంలో, లీలా ప్రెగ్నెంట్ గురించి బయటపడుతుంది. ఈ సమయంలో ఆమె అమ్మమ్మ ఒక ఫ్యామిలీ సీక్రెట్ ను బయటపెడుతుంది. ఇది లీలాను తన తల్లి గతాన్ని తెలుసుకునేలా చేస్తుంది.
ఈ సీక్రెట్ షిరీన్ టీనేజ్ కథను బయటపెడుతుంది. ఇది 1960లలో ఇరాన్‌లో జరుగుతుంది. షిరీన్ 13 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కారణంగా ఒక వైద్యుడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. కానీ ఆమె జీవితం విషాదంతో, అమెరికాకు వలస వెళ్లేలా చేస్తుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా, లీలా తన తల్లిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఈ ఆమె తన తల్లి గతంతో సమాంతరంగా ఉన్న తన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. చివరికి ఈ స్టోరీ ఒక ఎమోషనల్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. లీలా తన తల్లితో ప్రేమతో ఉంటుందా ? లీలాకి ప్రెగ్నెంట్ వల్ల సమస్యలు వస్తాయా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈసినిమాని మిస్ కాకుండాచూడండి.
నెట్ ఫ్లిక్స్ లో
‘The Persian Version’ మర్యం కేశవర్జ్ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ కామెడీ సినిమా. ఇది 2023 జనవరి 21న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రంలో లయలా మొహమ్మదీ, నియోషా నూర్, కమంద్ షఫీసాబెత్, బిజన్ దనేష్మంద్, బెల్లా వార్డా నటించారు. 2023 అక్టోబర్ 20న సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ ద్వారా థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. IMDBలో ఈ సినిమాకి 6.7/10 రేటింగ్ ఉంది.