BigTV English

OTT Movie : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : కామెడీ జానర్ ఆడియన్స్ కి చెప్పలేనంత ఫన్ ఇస్తాయి. ఇలాంటి జానర్ లో వచ్చిన సినిమాలు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హాలోవీన్ ఫెస్టివల్ సందర్భంగా జరుగుతుంది. ఇక్కడ ఒక యువతి అనుకోకుండా ఒక పురాతన దెయ్యాన్ని బయటికి వచ్చేలా చేస్తుంది. ఇక అది చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆప్రాంతం మొత్తం గందరగోళం సృష్టిస్తుంది. ఆడియన్స్ తో ఈ సినిమా కేక పెట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళ్తే

హోవార్డ్, ఎమిలీ అనే జంట 14 ఏళ్ల కుమార్తె సిడ్నీ తో బ్రూక్లిన్ నుండి బ్రిడ్జ్ హాలో అనే చిన్న పట్టణానికి కొత్త జీవితం కోసం మారుతారు. హోవార్డ్ ఒక సైన్స్ టీచర్ కావడం వల్ల, అతీంద్రియ శక్తులను అంతగా నమ్మడు. అంతేకాకుండా హాలోవీన్‌ ఫెస్టివల్ ను ద్వేషిస్తాడు. కానీ సిడ్నీకి దెయ్యాలు, పారానార్మల్ విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ సమయంలో బ్రిడ్జ్ హాలో పట్టణం హాలోవీన్‌ను ఘనంగా జరుపుకుంటుంది. అలంకరణలతో నిండి ఉంటుంది. సిడ్నీ కొత్త ఇంటి అటకలో ఒక పాత లాంతరును కనిపెడుతుంది. ఇక దానిని వెలిగించడంవల్ల, స్టింగీ జాక్ అనే పురాతన దుష్ట ఆత్మ విడుదలవుతుంది. ఈ ఆత్మ పట్టణంలోని హాలోవీన్ లో బొమ్మలుగా అలకరించిఉన్న జోంబీలు, మంత్రగత్తెలు, గుమ్మడికాయలు, భయంకరమైన క్లౌన్‌లను జీవం పోసుకునేలా చేస్తుంది. ఇవి పట్టణంలో గందరగోళం సృష్టిస్తాయి.


సిడ్నీ తన తండ్రి హోవార్డ్‌తో కలిసి, ఈ శాపాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ హోవార్డ్ మొదట్లో దీనిని నమ్మడు. వీళ్ళు స్థానిక పారానార్మల్ సొసైటీ విద్యార్థుల సహాయంతో, స్టింగీ జాక్‌ను ఓడించడానికి ఒక పాత మాంత్రిక గ్రిమోర్ (మాయా పుస్తకం) ను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో సిడ్నీ, హోవార్డ్ తమ గతంలోని విభేదాలను సరిదిద్దుకుంటూ, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకుంటారు. చివరికి సిడ్నీ, హోవార్డ్ ఒక మాంత్రిక విధానంతో స్టింగీ జాక్‌ను ఓడించి, పట్టణాన్ని రక్షిస్తారు. ఈ సంఘటన హోవార్డ్‌ను హాలోవీన్‌పై తన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తుంది. ఈ చిత్రం ఒక ఫన్ క్రియేట్ చేస్తూ ముగుస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘The Curse of Bridge Hollow’ జెఫ్ వాడ్లో దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ సూపర్‌నాచురల్ కామెడీ హారర్ చిత్రం. ఇది టాడ్ బెర్గర్, రాబర్ట్ రూగన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో మార్లన్ వయాన్స్, ప్రియా ఫెర్గూసన్, కెల్లీ రౌలాండ్, జాన్ మైఖేల్ హిగ్గిన్స్, లారెన్ లాప్కస్, రాబ్ రిగ్గల్, నియా వర్దలోస్ నటించారు. ఇది 2022 అక్టోబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

Read Also : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

Related News

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

Big Stories

×