BigTV English

Viral Video: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, సూపర్ ఉమెన్‌ లా దూకుతూ..

Viral Video: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, సూపర్ ఉమెన్‌ లా దూకుతూ..

Himachal Nurse Viral Video:  ప్రభుత్వ ఉద్యోగుల పని తీరుపై ప్రజల్లో ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటారే తప్ప, సరైన పనులు చేయరు అనే విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలు తప్పని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో భారీ వర్షాల సందర్భంగా నడి చెరువులో ఉన్న కరెంట్ స్తంభం మీద విద్యుత్ వైర్ తెగితే ఈత కొట్టుకుంటూ వెళ్లి వైరును కలిపిన కరెంట్ లైన్ మెన్ సాహసం చూసి అందరూ శభాష్ అని మెచ్చుకున్నారు తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఓ ఆరోగ్య కార్యకర్త చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..?

తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. రహదారులు, మార్గాలు అన్నీ కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో పసి పాపకు పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త కమలా దేవి ప్రాణాలకు పణంగా పెట్టి ఉప్పొంగుతున్న వాగును దాటి వెళ్లింది.  చౌహర్‌ఘాటి వాగు మధ్యలో ఉన్న రాళ్ల మీది నుంచి దూకుతూ వెళ్లింది. ఏ మాత్రం కాలు జారినా నీటి ప్రవాహంలో కొట్టుకు పోవడం ఖాయం అని తెలిసినా, ప్రాణాలకు తెగించి వెళ్లి రెండు నెలల ఆడ శిశువుకు టీకాలు వేసింది.


కమలా దేవిపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు

కమలా దేవి వాగు దాటుతూ వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆమె చూపిన ధైర్యం, వృత్తి నిబద్ధతను అందరూ ప్రశంసిస్తున్నారు. మెడికల్‌ కిట్‌ను భుజాన వేసుకొని ఆమె విధులు నిర్వర్తిస్తున్న తీరును సోషల్ మీడియాలో పలువురు కొనియాడారు. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించాలని ఎవరూ బలవంతం చేయకూడని ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు. మొత్తంగా కమలా దేవి చేసిన సాసహం అభినందనీయం అని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసించింది.

ఇక గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. పలు ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడ రోడ్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

Read Also: సోషల్ మీడియా కోసం రిస్క్.. చూస్తుండగానే యూట్యూబర్ బలి!

Related News

Viral Video: కారు రన్నింగ్‌లో ఉండగా.. స్టీరింగ్ వదిలేసి.. డోరు తెరిచి బొన్నెట్‌పై కూర్చొని రిస్కీ స్టంట్!

Viral Video: డేంజర్ యాక్సిడెంట్.. సీసీటీవీ ఫుటేజ్‌లో షాకింగ్ నిజాలు, వైరల్ వీడియో

Shrekking: అందంగా లేకపోయినా ఐ లవ్యూ చెప్పేసెయ్.. డేటింగ్ లో ఇదో కొత్త ట్రెండ్

YouTuber accident: సోషల్ మీడియా కోసం రిస్క్.. చూస్తుండగానే యూట్యూబర్ బలి!

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Big Stories

×