BigTV English

OTT Movie : భర్తకు తెలియకుండా మరొకరితో… దెయ్యమని తెలిసినా ఇదేం పాడు పని మావా?

OTT Movie : భర్తకు తెలియకుండా మరొకరితో… దెయ్యమని తెలిసినా ఇదేం పాడు పని మావా?

OTT Movie : రాజస్థానీ జానపద కథ ఆధారంగా రూపొందిన ఒక ఫాంటసీ సినిమా, ఇండియా నుండి 2006 ఆస్కార్ అవార్డులకు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. ఒక ప్రేమ కథను, అతీంద్రియ అంశాలతో కలిపి, రాజస్థాన్ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాని అద్భుతంగా తెరేక్కించారు. ఇది రంగురంగుల విజువల్స్, ఎం.ఎం. కీరవాణి సంగీతం, షారుఖ్ ఖాన్, రానీ ముఖర్జీల నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

లచ్చి (రానీ ముఖర్జీ), ఒక రాజస్థానీ అమ్మాయి. కిషన్‌లాల్ (షారుఖ్ ఖాన్) అనే వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడితో వివాహం చేసుకుంటుంది. వివాహం తర్వాత, కిషన్‌లాల్ తన కుటుంబ వ్యాపారం కోసం ఐదు సంవత్సరాల పాటు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. లచ్చిని తన ఇంట్లో వదిలి పెట్టి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇంటికి వెళ్తున్నపుడు ఒక పాత ఆలయంలో ఆగుతారు. అక్కడ కాకిరూపంలో ఉన్న ఒక ఆత్మ (షారుఖ్ ఖాన్ డబుల్ రోల్‌లో) లచ్చి సౌందర్యం చూసి ఆమెపై ప్రేమలో పడుతుంది. ఇక లచ్చిని తన ఇంట్లో వదిలి, కిషన్‌లాల్ వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆతరువాత ఈ ఆత్మ కిషన్‌లాల్ రూపంలో మారి, లచ్చి దగ్గరకు వస్తుంది. తాను నిజమైన కిషన్‌లాల్ కాదని, కానీ నిన్ని నిజంగా ప్రేమిస్తున్న ఒక ఆత్మ అని చెబుతుంది. లచ్చి అతని ప్రేమ, ఆప్యాయతకు లొంగిపోతుంది. అతనితో జీవించడానికి అంగీకరిస్తుంది.


అయితే ఈ నిర్ణయం ఆమె జీవితంలో అనేక మార్పులు తెస్తుంది. కిషన్‌లాల్ రూపంలో వచ్చిన ఆత్మ, లచ్చితో సంతోషంగా జీవిస్తూ, ఆమె కుటుంబానికి కూడా ఆర్థికంగా సహాయపడుతుంది. దీనివల్ల కిషన్‌లాల్ తండ్రి బన్వారీలాల్ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటారు. అయితే నిజమైన కిషన్‌లాల్ ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు, గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇద్దరు కిషన్‌లాల్‌లు ఉంటారు. గ్రామస్థులు, కుటుంబం ఎవరు నిజమైన కిషన్‌లాల్ అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష ఏర్పాటు చేస్తారు. ఇక ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారు ? ఎలాంటి పరీక్ష పెడతారు ? ఆత్మ గెలుస్తుందా ? భర్త గెలుస్తాడా ? లచ్చి ఎవరిని ఎంచుకుంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ బాలీవుడ్ సినిమాని చూడాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ లో

‘పహేలీ’ (Paheli) అమోల్ పాలేకర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇది విజయదాన్ దేథా రాసిన “దువిధా” అనే రాజస్థానీ నవల ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, రానీ ముఖర్జీ, అనుపమ్ ఖేర్, దిలీప్ ప్రభావల్కర్, అమితాబ్ బచ్చన్ (అతిథి పాత్రలో) నటించారు. ఇది 2005 జూన్ 24న విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి.. ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా అయ్యా ? అన్నీ అవే సీన్లు

Related News

OTT Movie : అందరి ముందే ఆ పని… మనవరాలికి యాంగిల్స్ గురించి నూరి పోసే బామ్మ… ఈ బ్లాక్ కామెడీ ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో ఆ ఆట ఆడే దెయ్యం… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపదు, దబిడి దిబిడే

OTT Movie : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్

OTT Movie : అపార్ట్మెంట్లో వరుస హత్యలు… ఈ సీరియల్ కిల్లర్ టార్గెట్ అమ్మాయిలే… కిర్రాక్ సైకో కిల్లర్ మూవీ

Big Stories

×