Actor Yash: కన్నడ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కేజిఎఫ్ హీరో, రాకింగ్ స్టార్ యష్(Yash) ఒకరు. ఒక సాధారణ బస్సు డ్రైవర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం హీరోగా అవకాశాలను అందుకొని సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించిన కేజిఎఫ్ (KGF) సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలను సృష్టించింది. అనంతరం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా స్టార్ హీరోగా..
ఇక ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడంతో నటుడు యష్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ 2 విడుదల కావడం ఈ సినిమా కూడా సంచలనాలను సృష్టించడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత యష్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన టాక్సిక్(Toxic) సినిమాతోపాటు బాలీవుడ్ రామాయణ (Ramayana) సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
టాక్సిక్ కోసం దర్శకుడిగా మారిన యశ్..
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను యశ్ తన సొంత బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో యశ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను స్వయంగా యష్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది . ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహిస్తున్న ఈ షెడ్యూల్ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.
రావణాసురుడి పాత్రలో యశ్…
ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కొన్ని డైలాగ్స్ కూడా యశ్ రాసారని తెలుస్తోంది. ఇలా ఒక సినిమా కోసం నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా యశ్ వ్యవహరించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందేనని, ఈయన డైరెక్షన్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కచ్చితంగా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కే జి ఎఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు యశ్ రామాయణ సినిమాలో రావణాసురుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Kingdom OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ కింగ్డమ్.. ఎప్పుడంటే?