BigTV English

Tamannaah: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన తమన్నా కొత్త వెబ్ సిరీస్.. పూర్తి వివరాలు ఇవే!

Tamannaah: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన తమన్నా కొత్త వెబ్ సిరీస్.. పూర్తి వివరాలు ఇవే!

Tamannaah: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా (Tamannaah ) ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో తన ప్రతిభను చాటిన ఈమె.. ఇప్పుడు ‘డూ యూ వాన్నా పార్టనర్’ అనే మరో కొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సీరీస్ గా రాబోతున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుండి అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఓటీటీ ప్రియులను తన నటనతో బాగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో మరో సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


స్ట్రీమింగ్ కి సిద్ధమైన తమన్నా కొత్త వెబ్ సిరీస్..

ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. కామెడీ డ్రామా శైలిలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో మరో బాలీవుడ్ నటి డయానా పెంటీ (Daina penty) కూడా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. నందిని గుప్తా, ఆర్ష్, మిధున్ గంగోపాధ్యాయ రచించగా.. నిశాంత్ నాయక్, గంగోపాధ్యాయ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ఇద్దరు యువతుల మధ్య స్నేహం వారి జీవితంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు తదితర అంశాలను ముఖ్యంగా చూపించనున్నారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ వెబ్ సిరీస్ తమన్నాకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.


తమన్నా కెరియర్..

తమన్నా విషయానికి వస్తే..’శ్రీ’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు లభించకపోయినా.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత రచ్చ, బద్రీనాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు హిందీ, తమిళ్లో చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకున్న ఈమె.. ఇప్పుడు సౌత్ లో అవకాశాలు కోల్పోవడంతో.. బాలీవుడ్ లోనే సెటిల్ అయిందని చెప్పవచ్చు అక్కడే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారిన ఈమె తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమన్నా వ్యక్తిగత జీవితం..

తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోయారని సమాచారం. మొత్తానికి అయితే తమన్నా ఇప్పుడు వెబ్ సిరీస్ లతోనే కెరియర్ ను కొనసాగించబోతుందని కూడా వార్తలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ:Bigg Boss 9: 10 మినిట్స్ లో కేజీ వెయిట్.. ఫోర్ హెడ్ పై పచ్చబొట్టు.. ఈ ట్విస్ట్ లు మామూలుగా లేవుగా! 

 

Related News

OTT Movies : ఈ వారం మూవీ లవర్స్ కు జాతరే.. ఏకంగా 27 సినిమాలు..ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : అందరి ముందే ఆ పని… మనవరాలికి యాంగిల్స్ గురించి నూరి పోసే బామ్మ… ఈ బ్లాక్ కామెడీ ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : భర్తకు తెలియకుండా మరొకరితో… దెయ్యమని తెలిసినా ఇదేం పాడు పని మావా?

OTT Movie : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో ఆ ఆట ఆడే దెయ్యం… ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపదు, దబిడి దిబిడే

Big Stories

×