Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వైవాహిక బంధంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా.. కానీ అనూహ్యంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నిజానికీ వీరిద్దరూ కలిసి నటించకపోయినా.. ప్రేమలో పడినట్లు వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రూమర్ కి ఈ జంట చెక్ పెట్టదా?
ఈ వార్తలకు తోడు ఇటీవల ధనుష్.. మృణాల్ పుట్టినరోజు పార్టీకి హాజరు కావడంతో ఈ డేటింగ్ వార్తలు నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ధనుష్ సినిమా ఈవెంట్లకి కూడా మృణాల్ వెళుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వీరిద్దరూ మరీ క్లోజ్ గా కలిసి కనిపించడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. అలా వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అలా రూమర్లు బాగా పాకిపోతున్నా.. వీరిద్దరూ మాత్రం స్పందించలేదు. పైగా వీరు పెట్టే పోస్టులతోనూ చిక్కుల్లో పడుతున్నారని చెప్పవచ్చు.
మరో పోస్టుతో పెళ్లి వార్తలు..
ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఒక పోస్ట్ అటు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారడమే కాకుండా రూమర్స్ ను మరింత నిజం చేసిందని చెప్పవచ్చు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే ఒక కొత్త రూమర్ తెరపైకి వచ్చేలా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక బీచ్ వద్ద నిల్చొని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేస్తూ..” అనుకోని సంఘటనలు అద్భుతాన్ని సృష్టిస్తాయి”.. అనే ఒక క్యాప్షన్ జోడించారు ధనుష్. ఈ పోస్ట్ ని మృణాల్ ఠాకూర్ లైక్ చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
అందుకే ధనుష్ కూడా ఇలాంటి అర్థం కాని పోస్ట్ పెట్టగా.. అది అర్థమైన మృణాల్ లైక్ కొట్టింది అంటూ ఎవరికి వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ ఫోటో చూసిన చాలామంది ఇది మృణాల్ తీసింది అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇప్పటికైనా ఈ జంట రూమర్స్ కి చెక్ పెడతారా? లేక సైలెంట్ గా ఉండిపోతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ధనుష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తూ ఉండగా.. అటు మృణాల్ ఠాకూర్ అడివి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో నటిస్తోంది.
ALSO READ:Tamannaah: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన తమన్నా కొత్త వెబ్ సిరీస్.. పూర్తి వివరాలు ఇవే!