Actor Kollam Thulasi: వెండితెరపై ఓ వెలుగువెలిగిన ప్రముఖ నటుడు ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. అందరు ఉన్న అనాథగా ఆశ్రమంలో చేరారు. తనదైన నటనతో వెండితెరపై మంచి గుర్తింపు పొందిన ఆయన.. ప్రస్తుతం ఆశ్రమంలో నివసిస్తున్న ఆయన దీనస్థితి ప్రతి ఒక్కరిని కదలిస్తోంది. ఇంతకి ఆ నటుడు ఎవరూ? అనాథగా ఆశ్రయమంలో ఎందుకు ఉండాల్సి వస్తుందో ఇక్కడ చూద్దాం!
మలయాళంలో స్టార్ నటుడు
ప్రముఖ మలయాళ నటుడు కొల్లమ్ తులసి మాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒకప్పుడు నటుడిగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల కేరళలోని గాంధీ భవన్ ఆశ్రమంలో జరిగిన ఓ ఈవెంట్‌లో అసలు విషయం బయటపడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఎంతోముద్దుగా చూసకున్న కూతురు ఛీ కోట్టిందని, జీవితాంతం తోడు ఉండాల్సిన భార్య తరిమేసిందని చెప్పారు.
కన్న కూతురే నన్ను ద్వేషిస్తోంది..
దీంతో ఇంట్లోనుంచి బయటకు వచ్చిన తాను ఎక్కడ ఉండాల్సి తోచక ఆనాథ ఆశ్రమంలో చేరానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నా భార్య నన్ను వదిలేసింది. నా కూతురు కూడా నన్ను పట్టించుకోలేదు. చిన్నప్పుడు తనని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. కానీ కన్న కూతురికి కూడా నేను పరాయివాడినైపోయాను. భార్య తరిమేస్తే.. కూతురు వదిలించుకుంది. నా కూతురు ఇంజనీరింగ్ చదివాంచాను. ఆస్ట్రేలియాలో బాగా సెటిలైంది. కనీసం నా భార్య, కూతురు నాకు ఫోన్ కూడా చేయరు. నన్ను చూసి అసహ్యించుకుంటారు. ద్వేషిస్తున్నారు.
అనాథ ఆశ్రమంలో ఆ స్టార్ నటి కూడా
దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆశ్రమంలో చేరాను. ఆరు నెలలుగా ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఇక్కడ నాతో పాటు పని చేసిన స్టార్ నటి కూడా ఉది. నటిగా ఆమె రాష్ట్రస్థాయిలో అవార్డులు కూడా తీసుకుంది. ఎంతో కష్టపడి పిలల్లను చదివించింది. కుటుంబాన్ని పోషించింది. కానీ, ఆమెకు వయసుపైబడిన తల్లి ఉంది. దీంతో ఆమె కుటుంబం ఆమెకు వదిలించుకోమ్మని చెప్పారు. అందకు మనసు ఒప్పక భర్తను పిల్లల్ని వదిలేసి తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట బతికేంత స్థోమత లేక తల్లితో కలిసి అనాథ ఆశ్రమంలో ఉంటుంది. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓ గుణపాఠం’ అని చెప్పుకొచ్చారు.
Also Read: OG Pre Release Event: ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ప్లాన్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?