SSC Constable Jobs : పోలీస్, రక్షణ శాఖలో విధులు నిర్వహించాలనుకుంటున్న అభ్యర్ధులకు ఇదో పెద్ద శుభవార్త. 24వేల 369 పోస్టులను భర్తీ చేయడానికి ఎస్ఎస్‌సీ సన్నద్ధమైంది. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్,ఎన్ఎస్‌బీ,ఎస్ఎస్ఎఫ్, ఐటీబీపీ శాఖలో ఉన్న కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కేవలం బీఎస్ఎఫ్‌లోనే 10వేల 497 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఆర్పీఎఫ్‌లో 8911 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 27-10-2022 నుంచి 30-11-2022 లోగా అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 24,369
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్సైట్ https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభం : 27-10-2022
దరఖాస్తు చివరితేది : 30-11-2022