BigTV English
Advertisement

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

ISRO: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శ్రీహరి కోట తిరుపతి జిల్లా (ISRO SDSC SHAR) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది.పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా(నర్సింగ్‌), డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శ్రీహరి కోట తిరుపతి జిల్లా (ISRO SDSC SHAR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 141 టెక్నీషియన్‌, సైంటిస్ట్‌/ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్‌ 16వ తేదీ నుంచి నవంబర్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 141


పోస్టులు – వెకెన్సీలు..

 సైంటిస్ట్‌/ఇంజినీర్‌-ఎస్‌సీ: 23
టెక్నికల్ అసిస్టెంట్‌: 28
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 03
 లైబ్రరీ అసిస్టెంట్‌-ఏ: 01
రేడియోగ్రాఫర్‌-ఏ: 01
టెక్నీషియన్‌-బీ: 70
డ్రాట్ర్స్‌మెన్‌-బీ: 02
కుక్‌: 03
ఫైర్‌మెన్‌-ఏ: 06
లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌-ఏ: 03
నర్స్‌-బీ: 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా(నర్సింగ్‌), డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 14

వయస్సు: 2025 నవంబర్‌ 14వ తేదీ నాటికి సైంటిస్ట్‌/ఇంజినీర్‌-ఎస్‌సీకి 18 – 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 – 35 ఏళ్లు వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు సైంటిస్ట్‌/ఇంజినీర్‌కు రూ.56,100 – రూ.1,77,500 జీతం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌కు రూ.44,900 – రూ.1,42,400, రేడియోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100, టెక్నీషియన్‌-బీ, డ్రాట్స్‌మెన్‌కి రూ.21,700 – రూ.69,100, నర్స్‌-బీకి రూ.44,900 – రూ.1,42,400, కుక్‌, డ్రైవర్‌, ఫైర్‌మెన్‌కు రూ.19,900 – రూ.63,200 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: పోస్టును బట్టి అప్లికేషన్ ఫీజు రూ.500 నుంచి రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://apps.shar.gov.in/

ALSO READ: PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

Related News

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ

RRC NWR: రైల్వేలో 2162 ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే.. ఇంకా ఒక్క రోజే గడువు

Big Stories

×