PNB LBO: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు ప్రారంభ వేతనమే రూ.48,480 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం… దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 750
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్‌బీఓ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా వెకెన్సీ వివరాలు..
ఆంధ్రప్రదేశ్: 05
గుజరాత్: 95
కర్ణాటక: 85
మహారాష్ట్ర: 135
తెలంగాణ: 88
తమిళనాడు: 85
పశ్చిమ బెంగాల్: 90
జమ్మూ &కాశ్మీర్: 20
లద్దాఖ్: 03
అరుణాచల్ ప్రదేశ్: 05
అస్సాం: 86
మణిపుర్: 08
మేఘాలయ: 08
మిజోరం: 05
నాగాలాండ్: 05
సిక్కిం: 05
త్రిపుర: 22
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కనీసం ఏడాది బ్యాంకింగ్ ఎక్స్ పీరియన్స్ అవసరం. అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.48,480- రూ.85,920 వరకు జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
రాత పరీక్ష విధానం: రీజనింగ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), డేటా ఇంటర్‌ప్రిటేషన్ (25 ప్రశ్నలు 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 25 మార్కులు), ఇంగ్లిష్ (25 ప్రశ్నలు 25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు 50 మార్కులు) నుంచి మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59 ఫీజు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ/గుంటూరు, వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 23
ఎగ్జామ్ తేదీలు: 2025 డిసెంబర్/ 2026 జనవరి
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 750
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 23