BEL Notification: నిరుద్యోగులకు ఇది భారీ శుభవార్త. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ (సివిల్, మెకానికల్, సీఎస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పాసైన వారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.1,40,000 వరకు జీతం అందజేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోంి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 340
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్), ప్రొబేషనరీ ఇంజినీర్ (మెకానికల్) , ప్రొబేషనరీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్), ప్రొబేషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ప్రొబేషనరీ ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్): 175 పోస్టులు
ప్రొబేషనరీ ఇంజినీర్(మెకానికల్): 109 పోస్టులు
ప్రొబేషనరీ ఇంజినీర్(కంప్యూటర్ సైన్స్): 42 పోస్టులు
ప్రొబేషనరీ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 14 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(సివిల్, మెకానికల్, సీఎస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 14
వయస్సు: 2025 అక్టోబర్ 1 నాటి అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1180 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష (సీబీటీ)/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 340
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 14
ALSO READ: Jayammu Nischayammu Raa: రష్మికకు కొత్త ట్యాగ్.. ఆ ముగ్గురు కలిసొచ్చారంటూ!