BigTV English

TTD:-ఏప్రిల్ టికెట్లు నేడే విడుదల

TTD:-ఏప్రిల్ టికెట్లు నేడే విడుదల

TTD:- శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సోమవారం అంటే ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సాలకట్ల వసంతోత్సవకు సంబంధించిన టికెట్లను ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.


శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి పది గంటలకిపైగా సమయం పడుతోంది. స్వామివారిని 60వేలమందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీల ద్వారా రూ.3.72కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 30న శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఆస్తానాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 30న హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరంలో శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవను ప్రారంభించింది. 2000 విజిలెన్స్, ఆరోగ్యం, అన్నప్రసాదం, ఉద్యానవనం, వైద్యం, లడ్డూప్రసాదం, దేవాలయం, రవాణా, కళ్యాణకట్ట, బుక్ స్టాల్స్ మొదలైన ప్రధాన యాత్రికుల అంతర్ముఖ ప్రాంతాలతో తిరుమలలోని ఐదు డజనుకు పైగా ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల సేవలు వినియోగిస్తోంది.


ఈనెల 30న ఉదయం 9 నంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీతారామచంద్ర, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారి ఉత్సవర్లకు స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు.సాయంత్రం 6.30 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఈ సేవల దృష్ట్యా సహస్ర దీపాలకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. 31న బంగారువాకిలిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.

గోపురం ఎత్తుగానే ఎందుకుండాలి?

for more updates follow this link:-bigtv

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×