AAI Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు పండగ లాంటి వార్త. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. లక్షల రూపాయల్లో జీతాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 976
ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఆర్కిటెక్చర్): 11
జూనియర్ ఎగ్జిక్యూటివ్(సివిల్): 199
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్): 208
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రానిక్స్): 527
జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఐటీ): 31
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఆర్కిటెక్చర్/ సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 28
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 27
వయస్సు: 2025 సెప్టెంబర్ 27వ తేదీ నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది. నెలకు రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aai.aero/en/recruitment/release/618077
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 976
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 27
జీతం: నెలకు రూ.40వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనం
ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200
ALSO READ: SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..