Kantara: కాంతారా(Kantara) ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కన్నడ దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా కాంతారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2022లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాలో రిషబ్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో కాంతారా 2 (Kantara 2)సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
షూటింగ్ సమయంలోను వెంటాడిన ప్రమాదాలు…
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుసగా ప్రమాదాలు సంభవించడం అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్టులు వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో కాంతారా సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్లంజురి దేవుడి గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. భూత కోల ఆచార సాంప్రదాయాల ప్రకారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇలా దేవుడికి సంబంధించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం పనిచేసే నటీనటులను ఏదైనా దైవిక శక్తి వెంటాడుతోందా? లేకపోతే ఏదైనా శాపం వెంటాడుతోందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
నెలల వ్యవధిలోనే నలుగురు మరణం…
ఇలా ఓకే సినిమాకు చెందిన నలుగురు ఆర్టిస్టులు మరణించడంతో కచ్చితంగా ఈ మరణం వెనుక ఏదో అతీత శక్తి దాగి ఉందని అందరూ భావిస్తున్నారు. కేవలం నెలల వ్యవధిలోనే సినిమా కోసం పనిచేసిన ప్రభాకర్ అనే నటుడు గుండెపోటుతో మరణించారు. అదేవిధంగా రాకేష్ పూజారి మే నెలలో గుండెపోటుతో మరణించారు. కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మరణించారు. కళాభవన్ అనే నటుడు కూడా జూన్ నెలలో గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఇతర నటీ నటులు కూడా ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు పలు సినిమాలకు సంబంధించిన సెలెబ్రిటీలు కూడా ఇలా వరుసగా మరణించిన సంగతి తెలిసిందే.
ఆందోళనలో కాంతారా నటీనటులు…
ఇలా ఆ సినిమాలు కూడా ఆత్మలకు సంబంధించిన, గాని లేదా ఆధ్యాత్మిక సినిమాలకు సంబంధించిన నటీనటులు కావడంతో కాంతారా చిత్ర బృందం కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ మరణాలను సహజ మరణాలుగా భావిస్తున్నప్పటికీ ఒకే సినిమాకు చెందినవారు ఇలా వరుసగా మరణించడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మరణాల గురించి హీరో రిషబ్ శెట్టి లేదా నిర్మాణ సంస్థ హోంభలే వారు కూడా ఎక్కడ స్పందించలేదు. మరి ఈ నలుగురి మరణం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కాబోతుందని వెల్లడించారు. ఇక మూడవ భాగం కూడా రాబోతుందని ఇదివరకు వార్తలు వస్తున్నాయి. మరి వరుస మరణాలతో ఈ సినిమాకు ఇక్కడికే పులిస్టాప్ పడుతుందా? లేదంటే వీటిని సహజ మరణాలుగా భావించి పార్ట్ 3 కూడా షూటింగ్స్ జరుపుకుంటున్న అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు