Companies declaring holiday on Coolie Release: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నెలకొంది. పైగా ఈసారి కూలీలో రజనీతో పాటు మరికొందరు స్టార్స్ భాగమయ్యారు. తెలుగు ఇండస్ట్రీ మన్మథుడు నాగార్జున, కన్నడ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్.. మరోవైపు అందాల భామ శ్రుతి హాసన్ వంటి అగ్ర తారలు కూలీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో అన్ని భాషల్లోనూ ఈ మూవీపై హైప్ ఓ రేంజ్ లో ఉంది. మొన్న రిలీజ్ తర్వాత అవి మరింత రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా తమిళనాడులో అయితే కూలీ మేనియా మామూలుగా లేదు.
ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా
చెన్నై మొత్తం కూలీ సెలబ్రేషన్స్ తో నిండిపోయింది. పైగా ఈసారి అభిమానులకు డబుల్ ధమాకాల… రజనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ యాడ్ అయ్యాయి. మరి చెన్నై ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరో ఐదు రోజుల్లో కూలీ థియేటర్లలోకి రాబోతోంది. ఇంకేముందు తమిళనాడు రాష్ట్రమంత సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు వివిధ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు సైతం కూలీ వేడుకల్లో భాగం అవుతున్నాయి. రజనీ సినిమా అంటే రాష్ట్రంలో సెలవులు ఉండాల్సిందే. పండుగలకు పబ్లిక్ హాలీడేస్ ఎలాగో.. రజనీ సినిమా అంటే కూడా హాలీడే పక్కా. గతంలో ఆయన ఎన్నో సినిమాలకు పలు ప్రైవేట్ సంస్థలు పెయిడ్ హాలీడేస్ ప్రకటించాయి.
సెలవు వచ్చేస్తోంది..
ఇక ఈ సారి రజనీకాంత్ 50 సిల్వర్ జూబ్లి కూడా ఉండటంతో ఆయన కంపెనీలు ఒక్కొక్కటికి సెలవులు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్స్ కూడా పంచబోతున్నారట. ఈ మేరకు యుఎన్ఓ ఆక్వా(UNO AQUA) సంస్థ ఆగష్టు 14న తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఫ్రీ టికెట్స్ కూడా పంపిణి చేస్తుంది. అంతేకాదు ఓల్డేజ్, అనాథాశ్రమంలోనూ ఆ రోజు స్వీట్స్ పంచనుందట. ఈ మేరకు సదరు సంస్థ ప్రకటన విడుదల చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ కూలీ మూవీతో పాటు ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకలు కావడంతో ఈ సందర్భంగా మా సంస్థ హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ కి పెయిడ్ లీవ్ రిక్వెస్ట్ చేశాం.
Also Read: kaantha Movie: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ ‘కాంత’ మూవీ ఫస్ట్ సాంగ్ అవుట్
ఈ మేరకు హెచ్ఆర్ కూడా ఒకే చెప్పేశారు. రజనీజం పేరుతో అనాథాశ్రమాలు, ఒల్డేజ్ హోమ్స్ లో స్వీట్స్ పంపిణీ కూడా చేయబోతున్నాం అంటూ సదరు సంస్థ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయా సంస్థ కూడా కూలీ రిలీజ్ సందర్భంగా తమ ఎంప్లాయిస్ కి సెలవులు ప్రకటిస్తున్నాయట. కాగా రజనీ సినిమాలకు హాలీడేస్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ప్రతీ సినిమాకు పలు కంపెనీలు సెలవులు ప్రకటిస్తాయి. ముఖ్యంగా కబాలి మూవీ రిలీజ్ సమయంలో తమిళనాడు వ్యాప్తంగా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Companies declaring holiday on the occasion of #SuperstarRajinikanth's movie release has become a common custom these days!
First one to start with!#Coolie pic.twitter.com/ptADrOfaVE
— Parthiban (@parthispeaks) August 9, 2025