BigTV English

TTD Calendar 2023: టీటీడీ కొత్త క్యాలెండర్లు వచ్చేశాయ్

TTD Calendar 2023: టీటీడీ కొత్త క్యాలెండర్లు వచ్చేశాయ్

TTD Calendar 2023:తిరుమల,తిరుపతి దేవస్థానం రూపొందించిన 2023 సంవత్సరం క్యాలెండర్‌ విడుదల చేశారు. గతేడాది డిమాండ్ తగ్గట్టు క్యాలెండర్ల సరఫరా లేకపోయింది టీటీడీ. ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండదని టీటీడీ చెబుతోంది.ఏటా టీటీడీ క్యాలెండర్లకు డిమాండ్ పెరుగుతోంది. స్వామి వారి చిత్రపటంతో ముద్రించే టీటీడీ క్యాలెడర్లు ఇంట్లో పెట్టుకోవడం శుభసూచికంగా భక్తులు భావిస్తుంటారు.
గతఏడాది ముద్రించిన ఈ క్యాలెండర్లకు డిమాండ్ ఎక్కువగా రావడంతో ముఖ్యమైన అన్ని నగరాల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు చైర్మన్ ఆదేశించారు. శుక్రవారం నుంచి ఈ క్యాలెండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో పెట్టారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల్లో విక్రయాలకు అందుబాటులో ఉంచుతారు.


టీటీడీ ప్రతిష్టాత్మకంగా ముద్రించిన 2023 సంవత్సర క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు ఉన్నాయి.

విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులో ఉన్నాయి.


12 పేజీల క్యాలెండర్‌ రూ.130
డీలక్స్‌ డైరీ రూ.150
చిన్న డైరీ రూ.120
టేబుల్‌ టాప్‌ క్యాలెండర్‌ రూ.75
శ్రీవారి పెద్ద క్యాలెండర్‌ రూ.20
పద్మావతీ దేవి క్యాలెండర్‌ రూ.20
శ్రీవారు, పద్మావతీ దేవి క్యాలెండర్‌ రూ.15
తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30

ఆన్‌లైన్‌లో, తపాలా శాఖ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. వివరాలకు 99639 55585, 0877–2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు.https://tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేసుకోవచ్చు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలు తపాలా శాఖ ద్వారా నేరుగా ఇంటి వద్దకే చేరుతాయి.

Related News

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Big Stories

×