Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. హోరాహోరి పోరు.. ప్రచారంలో ప్రధాన పార్టీలో బిజీ బిజీ.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిసి తీరాలని రెండు పార్టీల కీలక నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ హైడ్రా కూల్చివేతలను ప్రధాన ఆస్త్రంగా చేసుకుంటుంది.
ఈ బైపోల్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని.. ఓటేస్తే హైడ్రా వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తోందనే భయాన్ని జనాల్లో సృష్టించేందుకు బీఆర్ఎస్ తెగ కష్ట పడుతోంది. ఇందులో భాగంగానే.. హైడ్రా బాధితుల వీడియోలను చూపెడుతూ.. వారికి భయాందోళనకు గురి చేసేలా ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారి పార్టీ కాంగ్రెస్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం.. ఏమైనా యూజ్ ఉందా..?
ప్రచారంలో భాగంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఒక్క కొత్త కట్టడం కూడా లేదని చెబుతున్నారు. కేవలం కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని.. అప్పుడు బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి పాలనలో ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని అన్నారు. ఒవైసీ స్కూళ్లను సైతం కూల్చివేసిన ఈ ప్రభుత్వం గర్భిణులను పక్కకు తోసి, చిన్నపిల్లలను భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి బీఆర్ఎస్ సమాధానం చెబుతోందా..?
బీఆర్ఎస్ హైడ్రా ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ గెలిస్తేనే కూల్చివేతలు జరుగుతాయనే సందేశాన్ని బలంగా వినిపిస్తున్నప్పటికీ.. జూబ్లీహిల్స్ ప్రజల్లో మరో అనుమానం మొదలైంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా హైడ్రా కూల్చివేతలు ఆగకుండా ఉంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది కేవలం రాష్ట్రంలో ఒక్క సీటుకు మాత్రమే జరుగుతోంది. ఈ ఫలితం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలంపై ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపదు. బీఆర్ఎస్ ను గెలిపించినా కూడా ప్రభుత్వం హైడ్రా ద్వారా తమ పనులను ఆపలేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తమ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ లోకల్ లీడర్ అని.. ఆయన గెలిస్తే హైడ్రా వచ్చినప్పటికీ ప్రజలకు అండగా ఉంటారనే నమ్మకం కాంగ్రెస్ అభ్యర్థి నుంచి బలంగా వినిపిస్తున్న సమాధానం.
నిజంగా హైడ్రా వస్తే.. బీఆర్ఎస్ అండగా ఉంటుందా..?
బీఆర్ఎస్ కేవలం భయపెట్టి ఓట్లను పొందాలనే లక్ష్యంతోనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్‌ను రెచ్చగొడితే.. రేపు హైడ్రా తమ ఇళ్ల మీదకు వస్తే ఎవరు అండగా ఉంటారు?’ అన్న ఆలోచన ఓటర్లకు రావొచ్చు. అప్పుడు.. కాంగ్రెస్‌ను ఓడించడం ఎందుకు..? ఒక ఓటు వేస్తే చాలు కదా.. అని ఆలోచించి, హైడ్రాను నివారించాలంటే కాంగ్రెస్‌కు ఓటేయడమే మేలని ప్రజలు భావిస్తే మొత్తం ప్రచార ఫలితం తారుమారు అవుతుంది. నిజానికి జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తప్ప హైడ్రా జోక్యం ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ హైడ్రా పేరుతో రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే పాజిటివ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ALSO READ: AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు