Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో(Dhee Dance show) ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది తమలో ఉన్న ప్రతిభను బయట పెడుతూ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది ఢీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఢీ కంటెస్టెంట్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాజు(Raju) ఒకరు. ఢీ 20 లో కూడా పోటాపోటీగా తలపడుతున్న రాజు ఢీ 10 విజేతగా నిలిచి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే రాజు తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు తన వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు . ఈ సందర్భంగా వర్ష రాజుని ప్రశ్నిస్తూ మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు అనుకునే సమస్య ఏదైనా ఉందా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రాజు సమాధానం చెబుతూ తనకు హైదరాబాద్లో ఉండటానికి ఎక్కడ చోటు కూడా లేదు అయితే ఢీ 10 విజేతగా నిలిచిన తర్వాత ఉండటానికి కిరాయికి ఇల్లు తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను ఆ సమయంలో ఎన్నో చోట్ల ఇల్లు అద్దె కోసం ప్రయత్నాలు చేయగా ఎవరు తనకు అద్దెకు కూడా ఇల్లు ఇవ్వలేదని తెలిపారు.
ఇంటి అద్దె కోసం వెళితే ఏం చేస్తున్నారు? అని అడిగే వారు. డాన్సర్ అని సమాధానం చెప్పగానే ఇల్లు ఇవ్వమని మొహం మీదే చెప్పేవారు. ఆ క్షణం తనకు చాలా బాధ వేసేదని రాజు ఎమోషనల్ అయ్యారు. ఇలా అయితే కుదరదని ఒక అపార్ట్మెంట్ కు వెళ్లాను. 60 వేలు అద్దె అని చెప్పడంతో అందుకు కూడా ఒప్పుకున్నాను . చివరికి మీరు ఏం చేస్తారు అంటూ అక్కడ నుంచి కూడా ప్రశ్న వచ్చిందని డాన్సర్ అని చెప్పగానే తనకు అద్దెకు ఇల్లు ఇవ్వలేదని రాజు ఎమోషనల్ అయ్యారు. అసలు డాన్సర్స్ అంటే ఎందుకు అంత చులకనా.. ఇది కూడా వృత్తే కదా అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక తన కుటుంబ విషయాల గురించి కూడా మాట్లాడుతూ తన తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారని,ఆయన వెళ్లిపోవడంతో తన పై మరిన్ని బరువు బాధ్యతలు పెరిగాయని రాజు తెలిపారు. తనకంటూ ఆస్తులు ఏమీ లేవని తన కష్టమే తన ఆస్తి అని రాజు వెల్లడించారు. ఇప్పుడు కనుక మీ నాన్న ఈ వీడియో చూస్తుంటే మీ నాన్నగారికి ఏం చెబుతావు అంటూ వర్ష ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నతో ఈయన ఎమోషనల్ గా మిస్ యు నాన్న అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రాజు ఈ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి విషయాలను పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Also Read: Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!