Tips For Hair: జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం ఇంట్లోనే.. సహజ పద్ధతులను పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. అంతే కాకుండా జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. జుట్టు పెరగడానికి హెం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంతకీ ఎలాంటి హెం రెమెడీస్ వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుందనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉల్లిపాయ రసం :
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతే కాకుండా ఇది తల మాడుపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక చిన్న ఉల్లిపాయను పేస్ట్ చేసి రసం తీయండి. ఆ రసాన్ని తలకు బాగా పట్టించి 10-15 నిమిషాలు ఉంచి, ఆపై షాంపూతో శుభ్రం చేయండి. దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయవచ్చు.
2. ఎగ్ మాస్క్:
గుడ్లలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టుకు చాలా ముఖ్యం. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. అంతే కాకుండా కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి, దానికి ఒక టీస్పూన్ ఆలివ్ నూనె , కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, తల మాడుకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయండి.
3. మెంతులు:
మెంతుల్లో ప్రొటీన్ , నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి.
ఎలా ఉపయోగించాలి: రెండు చెంచా ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని మెత్తగా రుబ్బుకుని, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు మాస్క్‌లా అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి.
4. నూనెతో మసాజ్:
కొబ్బరి నూనె , ఆముదం , లేదా ఆలివ్ నూనె వంటి నూనెలను గోరు వెచ్చగా చేసి తలకు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించి జుట్టు వేగంగా పెరగడానికి దోహదపడుతుంది.
ఎలా చేయాలి: నూనెను వేడి చేసి వేళ్లతో సుమారు 4-5 నిమిషాలు వృత్తాకారంగా మసాజ్ చేయండి. రాత్రంతా ఉంచి.. మరుసటి రోజు తలస్నానం చేయండి.
5. కలబంద:
కలబంద (అలోవెరా) లోని ఎంజైమ్‌లు తలపై ఉండే చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపించి.. చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: కలబంద గుజ్జును (జెల్‌ను) తీసుకుని తల మాడుకు, జుట్టుకు బాగా అప్లై చేయండి. 30-40 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
6. ఆహారంలో మార్పులు:
బయట నుంచి సంరక్షణతో పాటు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ప్రొటీన్: గుడ్లు, పెరుగు, పప్పులు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి.
విటమిన్లు/మినరల్స్: ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు (ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, చేపలు) తీసుకోవాలి.
నీరు: ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
7. గ్రీన్ టీ :
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఎలా ఉపయోగించాలి: వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌లను తిరిగి ఉపయోగించి లేదా గ్రీన్ టీని కాచి, ఆ చల్లటి ద్రవాన్ని తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
Also Read: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?
చిట్కాలు:
నిలకడ: మంచి ఫలితం కోసం ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం.
ఒత్తిడి తగ్గించండి: ఒత్తిడి అనేది జుట్టు రాలడానికి ప్రధాన కారణం. యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
వేడి నీరు వద్దు: తలస్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది జుట్టును డ్యామేజ్ చేస్తుంది.