Road Accident: కర్ణాటక బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు కర్ణాటక గంగాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి కారులో వస్తుండగా హుమనాబాద్ సమీపంలో ఎదురుగా వస్తున్న డిటిడిసి వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అవ్వడంతో.. ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. మృతులు నాగప్ప, నవీన్, నాగరాజు గా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.