BigTV English

Chalapathirao : గొప్ప నటుడిని కోల్పోయాం.. చలపతిరావుకు ప్రముఖులు నివాళి..

Chalapathirao : గొప్ప నటుడిని కోల్పోయాం.. చలపతిరావుకు ప్రముఖులు నివాళి..

Chalapathirao : ప్రముఖ నటుడు చలపతిరావు మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. చలపతిరావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాదకరంగా పేర్కొన్నారు. చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


చలపతిరావు మృతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. చలపతిరావు మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. చలపతిరావు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రతినాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ తనదైన శైలిలో ఆయన ప్రేక్షకులను మెప్పించారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు, ఇతర కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్‌ నటులు కన్నుమూయడం దురదృష్టకరమని పవన్‌ పేర్కొన్నారు.

చలపతిరావు మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలపతిరావు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన నటుడని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×