BigTV English

Uses behind Gopanchakam : ఇంట్లో గో పంచకం చల్లితే కానీ ఆ దోషాల నుంచి బయటపడలేమా……

Uses behind Gopanchakam : ఇంట్లో గో పంచకం చల్లితే కానీ ఆ దోషాల నుంచి బయటపడలేమా……

Uses behind Gopanchakam : ఆవు హిందువులకు ఒక పవిత్ర జంతువు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయం, పశువుల పెంపకం ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ పురాతన కాలం నుంచి ఆవులు ఇక్కడ ఆరాధిస్తూనే ఉన్నారు. గోమాతగా భావిస్తుంటారు. గామూత్రాన్ని ఇంట్లో చల్లితే చాలా దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. గోపంచకానికి ఉన్న శక్తి ఇంత అనీ చెప్పలేనంతగా ఉంది. ఈ మధ్య కాలంలో గో మూత్ర చికిత్సలు కూడా పెరిగిపోయాయి. అనేక రోగాలకు ఔషధంగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ఒంట్లో ఉన్న రోగాలే కాదు ఇంట్లో చల్లితో గృహంలోని రోగాలు అంటే దోషాలు పోతాయి. సమస్తమైన దోషాలకు పోగోట్టే శక్తి ఉందని సనాతనంగా ఉన్న బలమైన విశ్వాసం.


చీడపట్టి చెట్లు ఎండిపోత్తూ వాటికి గో పంచకం రాసినా చాలు ఆ మొక్కలు మళ్లీ పచ్చగా నిలబడతాయి. అందుకు తగ్గ రుజువులు కూడా ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వాళ్ల ప్రేత ఉండిపోకుండా ఉత్తిష్టంతో భూత పిశాచ అని అంటూ ఉంటారు. భూతపిశాచాలు ఇంట్లో తిష్ట వేయకుండా ఉండటానికి కూడా గో పంచకం చల్లుతుంటారు. సేంద్రీయ వ్యవసాయానికి గో పంచకం ఉపయోగపడుతోంది . రసాయన వ్యవసాయానికి కంటే సేంద్రీయ వ్యవసాయం శ్రేష్టమైందని చెప్పడానికి కారణం గోవు మలమూత్రలతో చేయడమే కారణం. రసాయన ఎరువులతో భూసారం విషంగా మారుతోంది. దానికి విరుగుడే సేంద్రీయ వ్యవసాయం.

పంచగవ్య ప్రాసనం రూపంలో కూడా గో పంచకాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. చాలా ప్రాయశ్చిత్త కార్యక్రమాల్లో కూడా గో పంచాకన్ని వినియోగిస్తుంటాం. వేకువజామునకు ముందే యవ్వన దశలో ఉన్న ఆవు యొక్క మూత్రాన్ని సేకరించడం చాలా ఉత్తమం అని కొంతమంది నమ్ముతారు. అయితే చూలుతో ఉన్న ఆవు యొక్క మూత్రం ప్రత్యేక హార్మోన్లను కలిగి ఉండటం వలన అధిక పోషకతత్వాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. మూత్రం సాంప్రదాయికంగా శుభ్రపరిచే ద్రావణాల యొక్క యాంటీ మైక్రోబయాల్ చర్యలను పెంచుతుంది. ప్రత్యేకంగా ఇది నేలను శుద్ది చేయుటకు వాడతారు. ఆవు మూత్రంతో నేలను తుడవడం వలన అది అన్ని బ్యాక్టీరియాలను తొలగించడం ద్వారా స్థలాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×