Big Stories

BJP: భైరి, రేంజర్ల.. అయ్యప్ప, బాసర.. కావాలనే మత విధ్వేషాలా? అంతా రాజకీయమేనా?

BJP: భైరి నరేశ్. నాస్తిక నేతగా చాలాకొద్ది మందికే తెలిసిన పేరు. అయ్యప్ప పుట్టకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు హిందూ వ్యతిరేకిగా తెలంగాణ మొత్తం ఫేమస్ అయ్యాడు.

- Advertisement -

రేంజర్ల రాజేశ్. ఇతను కూడా అంబేద్కర్ భావజాలం ఉన్న నాస్తిక నేత. బాసర ఆలయంపై కాంట్రవర్సీ కామెంట్స్ తో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాడు.

- Advertisement -

భైరి నరేశ్. రేంజర్ల రాజేశ్. వీళ్లిద్దరు హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను విమర్శించడం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వాళ్లు అదే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో సెర్చ్ చేసి చూడండి.. వారి హేట్ స్పీచెస్ అనేకం కనిపిస్తాయి. అలాంటిది, ఇంతకుముందు లేనివిధంగా.. ఇప్పుడే వారి వ్యాఖ్యలపై ఎందుకు వివాదం చెలరేగుతోంది? గతంలో చేసిన కామెంట్లను ఇప్పుడెందుకు కొత్తగా తెరమీదకు వస్తున్నాయి? అంటే, ఇదంతా పక్కా ప్లాన్డ్ గా జరుగుతోందనే అనుమానం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో బెంగాల్, కర్నాటక, యూపీ తరహా రాజకీయం నడుస్తోందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎవరో నోటికొచ్చినట్టు వాగిన వాగుడుకు.. కావాలనే వివాదం రాజేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

బెంగాల్ ఎన్నికల సమయంలో హిందూ దేవుళ్లు, కాళీ మాతపై వివాదం రాజుకుంది. యూపీ ఎన్నికల సమయంలో కర్నాటకలో హిజాబ్ ఘటన చెలరేగి.. ఓ వర్గం ఓట్ బ్యాంక్ ను ఏకీకృతం చేయడంలో సక్సెస్ కాగలిగారు. బెంగాల్ లో బీజేపీ ఓడినా గెలిచినంత టెన్షన్ క్రియేట్ చేశారు. యూపీలో బీజేపీ ఈజీగా గెలిచేసింది. ఇలా ఎన్నికల సమయంలోనే దేవుళ్లు, మత విషయాలపై రచ్చ జరగడం.. కాకతాళీయం కాదంటున్నారు. ఎన్నికలు ముగిశాక.. బెంగాల్, యూపీ, కర్నాటకలు ప్రశాంతంగా ఉండటమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.

తెలంగాణలో ఇది ఎలక్షన్ ఇయర్. ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. మిషన్ 90 పేరుతో కమలనాథులు రంగంలోకి దిగారు. బీజేపీ ఎక్కడ యాక్టివ్ గా ఉంటే అక్కడ మత విధ్వేశాలు రెచ్చగొడుతుందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే చేసే విమర్శ. కేసీఆర్ సైతం పలుమార్లు ఇవే ఆరోపణలు చేశారు. ఇక, తెలంగాణలో ఎన్నికల వేడి రగులుకున్న ప్రస్తుత తరుణంలో భైరి నరేశ్, రేంజర్ల రాజేశ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడటం.. నరేశ్ పై భౌతిక దాడులకు దిగడం.. జిల్లాల్లో ధర్నాలు జరగడం.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ డిమాండ్లు.. అంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నరేశ్, రాజేశ్ లు అయ్యప్ప గురించి, బాసర ఆలయం గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పే. అవి శిక్షార్హమైన నేరమే. అయితే, వాళ్లు ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. కానీ, వారి పాత కొత్త వ్యాఖ్యలు ఈసారి తీవ్ర వివాదానికి దారి తీయడం.. తెలంగాణ వ్యాప్తంగా రచ్చ రాజుకోవడం.. వెనుక రాజకీయ కోణం ఉందనేలా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ ఆలోచించదగినదే అంటున్నారు. ఎన్నికల ఇయర్ లో బెంగాల్, యూపీ, కర్నాటక తరహాలో తెలంగాణలోనూ మత రాజకీయాలకు తెర తీశారా? అంతా కావాలనే చేస్తున్నారా? అనే చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుత గొడవ జస్ట్ టీజర్ మాత్రమేనని.. ఇది బాగా వర్కవుట్ కావడంతో.. ముందుముందు ట్రైలర్, అసలు సినిమా ఉంటుందని కూడా అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News