BigTV English

Dakshina Yanam : దక్షిణయానంలో చేయాల్సిన సత్కార్యాలు ఏంటి..

Dakshina Yanam : దక్షిణయానంలో చేయాల్సిన సత్కార్యాలు ఏంటి..

Dakshina Yanam : దక్షిణయానంలో చేయాల్సిన సత్కార్యాలు ఏంటి..సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణించే కాలాన్ని దక్షిణయానం అంటారు. జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అంటారు. కర్కాటకంలో సూర్యుడు ప్రవేశిస్తే దక్షిణయానం మొదలవుతుంది. ఆషాడ మాసం వచ్చే సమయం కూడా ఇదే. వాస్తవానికి దక్షిణయానం కంటే ఉత్తరాయణంలో పుణ్యకాలం ఎక్కువగా ఉంటుంది.
ఏడాదిలో ఆరునెలలు ఉత్తరాయణం ఉంటే మిగిలిన ఆరునెలల దక్షిణాయనంగా ఉంటుంది. సూర్యుడి గమనాన్ని బట్ట ఈ అయనాలు ఏర్పడుతుంటాయి..


ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. శ్రీమహావిష్ణువు ఈ కాలమంతా యోగనిద్రలో ఉంటాడు. అందుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం అవసరం. కాబట్టే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు, పూజలు చేస్తారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు చేయడం , పితృ తర్ఫణాలు వదలడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తాయి. ఈ కాలంలో సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళంలోకి ప్రవేశిస్తాడు . దక్షిణాయనంలో మహాలయ పక్షాలు వస్తుంటాయి. పితృదేవతల్ని సంతృప్తి పరిస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయి.

పంచాంగం ప్రకారం దక్షిణయానంలో ఎక్కువ పండుగలు వస్తాయి. దక్షిణయానం ప్రవేశించేటప్పుడు ఉదయం పూటే లేచి స్నానం చేసి పూజలు చేయడం , ధ్యానం చేయడం, మంత్రాలు పఠించడం మంచిదని శాస్త్రం చెబుతోంది. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం మేలు చేస్తుంది. విష్ణుపారాయణం, సూర్యారాధన, రావి చెట్టుకి ప్రదక్షణలు చేయడం శరీరానికి, మనస్సుకి మంచి కలిగిస్తాయి. దక్షిణయానంలో స్నానం, దానంతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×