Musi Floods: అది 1908.. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలు.. మూసీకి అత్యంత భారీ వరదలు.. ఆ ఏడాది సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూసీ వరదల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. ప్రజలు ఆగమాగం అయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ భయపడుతూ బతికారు. ఈ వరదల్లో దాదాపు 15 వేల మంది చనిపోయారు. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.
మూసీ నది ఉగ్రరూపం..
1908 సెప్టెంబరు 28, మంగళవారం భారీ వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా అల్లకల్లోలం అయ్యింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. వర్షాలు ఏం రేంజ్‌లో దంచికొట్టాయో.. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే 11 అడుగల కంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కలగజేసింది.
చింతచెట్టు ఎక్కి.. ప్రాణాలను కాపాడుకుని..
అయితే ఈ భారీ వర్షాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వేల మంది వరదల్లో కొట్టుకుపోయారు. లక్షల మంది నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే.. కొంత మంది చింతచెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లోని ఓ పెద్ద చింత చెట్టు ఉంది. పాత ఇన్‌పేషెంట్ బ్లాక్‌లో ఇది ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బ్లాక్ ఉన్న స్థలమంతా కూడా ఓ ఉద్యానవనంగా ఉండేది.
2 రోజులు బిక్కుబిక్కుమంటూ..
అయితే, 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లను ఎక్కినవారు.. కూకటివేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకు బలైపోయారు. కానీ ఈ చెట్టు ఎక్కినవారు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో ఉండగలిగారు. రెండు రోజుల పాటు వారు తిండీ తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారు. బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడిపారు. అయితే, అది సుమారు 400 ఏళ్ళ క్రితం నాటి చెట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నేటికి సజీవంగా ఉన్న చింతచెట్టు.. ఎక్కడో తెలుసా?
ఆ చింతచెట్టు నేటికీ సజీవంగా ఉంది. అంతే కాదు. చెట్టు చేసిన మహోపకారాన్ని ప్రస్తుతిస్తూ ఓ ఫలకాన్ని కూడా దానికి అమర్చారు. ఈ మూసీ వరదల వల్ల రెండు లక్షల మందికి పైగా బాధితులుగా మారారు. వరదల్లో 150 మందిని కాపాడిన ఈ చింత చెట్టు ఉన్న ప్రాంతాన్ని అఫ్జల్ పార్కుగా నామకరణం చేసి అభివృద్ధి చేశారు. నాటి నుంచి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది వరదల్లో చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నారు. ఎంతైనా ఆ చింతచెట్టు గ్రేట్ కదా. అటు సైట్ వెళ్తే ఆ చెట్టు వైపు ఓ లుక్కేయండి.
ALSO READ: Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు