E-Paper
Advertisement

Vehicle Sales:వాహ్ అనేలా వెహికల్ సేల్స్.. కారణం ఏంటంటే?

Vehicle Sales:వాహ్ అనేలా వెహికల్ సేల్స్.. కారణం ఏంటంటే?
Advertisement

Vehicle Sales:దేశంలో వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కార్లు, బైకులే కాదు… బిజినెస్ వెహికల్స్, ట్రాక్టర్స్.. ఇలా అన్ని విభాగాల వాహనాల విక్రయాల్లోనూ భారీ వృద్ధి నమోదైంది. గత జనవరిలో అన్ని రకాల వాహనాల అమ్మకాలు 14 శాతం పెరిగి… 18,26,669 యూనిట్లకు చేరాయి. వీటిలో త్రిచక్ర వాహనాల అమ్మకాలు అత్యధికంగా 59 శాతం పెరిగాయి.

కార్ల అమ్మకాలు 2022 జనవరితో పోలిస్తే… ఈ ఏడాది జనవరిలో 22 శాతం పెరిగి 3.4 లక్షలకు చేరాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు 10 శాతం పెరిగి 12.65 లక్షలకు చేరాయి. కార్ల కంపెనీల్లో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, టయోటా, కియా ఇండియా, హ్యుందాయ్‌ జనవరిలో భారీగానే కార్లు అమ్మాయి. మారుతీ 12 శాతం వృద్ధితో అత్యధికంగా 1,72,535 వాహనాలను అమ్మగా… మహీంద్రా అండ్ మహీంద్రా 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను విక్రయించింది. టాటా మోటార్స్‌ కార్ల అమ్మకాలు కూడా 6 శాతం పెరిగి 81,069 యూనిట్లకు చేరాయి. టయోటా కార్ల అమ్మకాలు ఏకంగా 175 శాతం పెరిగి 12,835 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా ఇండియా విక్రయాలు 48 శాతం పెరిగి 28,634 యూనిట్లకు చేరాయి. హ్యుండాయ్‌ 17 శాతం వృద్ధితో 62,276 వాహనాలు అమ్మింది.

Advertisement

ఇక త్రిచక్ర వాహనాల విక్రయాలు 59 శాతం పెరిగి 65,796 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 16 శాతం పెరిగి 82,428 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్లు 8 శాతం వృద్ధితో 73,156 యూనిట్లు అమ్ముడుపోయాయి. చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవడం… వాహన విడిభాగాలు, సెమీ కండక్టర్ల కొరత తగ్గుతుండటంతో… వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో వాహనాల కోసం వేచి చూసే సమయం కూడా తగ్గిపోతుందని… కార్ల విక్రయాలు మరింతగా దూసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×