BigTV English

Spy Balloon:గాలిలో స్పై బెలూన్.. చైనా కొత్త వ్యూహం..!

Spy Balloon:గాలిలో స్పై బెలూన్.. చైనా కొత్త వ్యూహం..!

Spy Balloon:డిఫెన్స్‌లో తమను తాము కాపాడుకునేందుకు సైనికులు టెక్నాలజీ ఉపయోగించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇది వారిని వారు కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా శత్రువుల కదలికలను గుర్తించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. శత్రువులకు అనుమానం రాకుండా వారిపై ఓ కన్నేసి ఉంచడానికి ఇప్పటికే ఎన్నో రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అందులోకి మరో కొత్త పరికరం వచ్చి చేరింది.


ఇటీవల చైనా వైపు నుండి అమెరికాకు ఒక తెల్ల బెలూన్ ఎగురుతూ వచ్చింది. అది ఒక దారితప్పని పర్యావరణ బెలూన్ అని చైనా కొట్టిపారేసింది. కానీ వాష్టింగన్‌లోని నిపుణులు దానిని అమెరికాపై నిఘా కోసం పంపిన బెలూన్‌గా అనుమానిస్తున్నారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలను గమనించడానికి బీజింగ్ దీనిని పంపినట్టుగా వారు భావిస్తున్నారు. ఇది ఒక స్పై బెలూన్ అన్న చర్చలు అమెరికాలో మొదలయ్యాయి. ఒకప్పుడు శత్రువులపై నిఘా పెట్టడానికి ఉపయోగించబడిన ఈ బెలూన్లు మళ్లీ వెలుగులోకి వచ్చినట్టుగా వారు చెప్తున్నారు.

అమెరికాలోకి ఎగిరివచ్చిన ఈ స్పై బెలూన్‌ను ఒక ఫైటర్ జెట్.. సౌత్ కరోలినాలోకి పడేసింది. దానిని పట్టుకొని మరిన్ని ఆధారాలు సేకరించాలని వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజింగ్ మాత్రం అమెరికా అనవసరంగా ఎక్కువగా కంగారుపడుతుందని స్పై బెలూన్ వార్తలను కొట్టిపారేసింది. కానీ అమెరికా మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చైనా వారిపై ఉన్న అనుమానంతో అమెరికా స్టేట్ సెక్రటరీ కూడా అక్కడి పర్యటనను రద్దుచేసుకున్నారు.


ఈ శాటిలైట్ల కాలంలో స్పై బెలూన్లు ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ బెలూన్లు హైటెక్ టెక్నాలజీతో తయారు చేయబడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. పైగా వీటితో ఇమేజింగ్ కూడా చేయవచ్చని వారు తెలిపారు. ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి ఇవి తమ దిశను మార్చుకున్నా కూడా వీటిలో ఒక గైడింగ్ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేస్తారని.. దాని ద్వారా తిరిగి అవి మళ్లీ రావాల్సిన చోటికి వస్తాయని వారు చెప్తున్నారు.

ఈమధ్య కాలంలో ఇలాంటి ఎన్నో స్పై బెలూన్లు అమెరికా వైపుకు వస్తున్నాయని అక్కడి ఉన్నతాధికారులు బయటపెట్టారు. దాదాపుగా మూడుసార్లు ఇవి తమ కంటపడ్డాయని నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ చైనా నుండే వచ్చినట్టుగా వారు కచ్చితంగా చెప్తున్నారు. 1800ల్లో ఈ బెలూన్ల తయారీ జరిగింది. అప్పటినుండి ఎన్నో యుద్ధాలలో వీటిని ఉపయోగించారు. వరల్డ్ వార్ 1,2 సమయాల్లో కూడా స్పై బెలూన్లు ముఖ్య పాత్రలు పోషించాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×