Microsoft Windows 10: మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి అక్టోబర్ 14, 2025 నుంచి సెక్యూరిటీ సపోర్ట్ నిలిపివేయనుంది. ఆ తర్వాత ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ ఉండవని తెలిపింది. అయితే ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. పెయిడ్ యూజర్లకు ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్డేట్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది.
అయితే అక్టోబర్ 14 తర్వాత కూడా విండోస్ 10 ఓఎస్ పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ కన్స్యూమర్ సీఎంవో యూసుఫ్ మెహదీ తెలిపారు. ఈ ఓఎస్ యూజర్లు ఎలాంటి అప్డేట్స్ పొందలేరని చెప్పారు. దీంతో సైబర్ దాడులు, మాల్వేర్ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
అప్డేట్స్ నిలిపివేతతో యూజర్లతో పాటు వ్యాపారాలు కూడా ప్రభావితం అవుతాయి. మాల్వేర్లు, వైరస్లు, సైబర్ దాడుల ముప్పు పెరుగుతుందని మైక్టోసాఫ్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని రకాల సాఫ్ట్వేర్ పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు.
ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు మైక్రోసాఫ్ట్ అవకాశం కల్పించనుంది. అయితే తమ పీసీలు ఓఎస్ అప్డేట్ కు అనుకూలమో కాదో తెలుసుకునేందుకు యూజర్లు సెట్టింట్స్ ఆప్షన్‌లోని విండోస్ అప్డేట్ను ఎంచుకుని పీసీ హెల్త్ చెకప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
మరికొంతకాలం పాటు విండోస్ 10 వినియోగించాలనుకునే వారి కోసం అప్డేట్స్ను మరో ఏడాది పాటు అందుబాటులో ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ కవరేజీకి(ESU) కల్పిస్తారు. దీనిని ఎంపిక చేసుకుంటే 2026 అక్టోబర్ 13 వరకు విండోస్ 10 ఓఎస్ కు సెక్యూరిటీ అప్డేట్స్ అందుతాయి. అయితే వ్యాపార సంస్థలు ఒక్కో పీసీకీ 61 డాలర్ల చొప్పున చెల్లించి ఈఎస్యూ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. మరో మూడేళ్ల పాటు సెక్యూరిటీ పొడిగించుకునేందుకు అవకాశం కూడా ఉంది.
విండోస్ 365 క్లౌడ్ పీసీల ద్వారా విండోస్ 10 వాడుతున్న వారికి ఈఎస్యూ ఉచితంగా అందిస్తారు.
మైక్రోసాఫ్ట్ డిఫెండర్
మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీ వైరస్ అక్టోబర్ 2028 వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. ఇది వినియోగదారులకు కొంత మేర రక్షణను అందిస్తుంది. అయితే ఇది కేవలం యాంటీ వైరస్ అని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే సెక్యూరిటీ ఉండదని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొంది.
వ్యాపారాల కోసం వాడే సిస్టమ్స్ కు ఈఎస్యూ పొందేందుకు ఏడాదికి 61 డాలర్లు ఖర్చవుతుంది. రెన్యువల్ చేసుకుంటే మూడు సంవత్సరాల వరకు విండోస్ 10 అందుబాటులో ఉంటుంది. Windows 11 క్లౌడ్ పీసీలు, Windows 365 వర్చువల్ సస్టిమ్స్ వంటి క్లౌడ్ సిస్టమ్స్ కు అదనపు ఛార్జీలు లేకుండా ESUను అందిస్తారు.
విండోస్ 11 సెక్యూరిటీ, మెరుగైన పనితీరును అందిస్తుందని మెక్రోసాఫ్ట్ తెలిపింది. విండోస్ 11.. విండోస్ 10తో పోలిస్తే 62 శాతం తక్కువ సెక్యూరిటీ లోపాలను, మూడు రెట్లు తక్కువ ఫర్మ్‌వేర్ దాడులను, 2.3 రెట్లు వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది.
Also Read: Infinix Hot 50 Ultra 2025: ఫ్లాగ్షిప్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా రూ. 10వేల లోపే
అక్టోబర్ 14, 2025 తర్వాత Windows 10 అకస్మాత్తుగా నిలిచిపోదు. మైక్రోసాఫ్ట్ యూజర్లకు మూడు అవకాశాలు కల్పించింది. సిస్టమ్ హార్డ్ వేర్ సపోర్ట్ చేస్తే Windows 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త Copilot+ PCని కొనుగోలు చేయాలి లేదా సెక్యూరిటీ కవరేజ్ కోసం ESU సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.