OTT Movie : ఓటీటీలో ఒక సర్వైవల్ హారర్ సినిమా చెమటలు పట్టిస్తోంది. షార్క్ చేపలతో నడిచే ఈ కథ, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో ఆడియన్స్ ని భయపెడుతోంది. ఇందులో ఒక వెకేషన్ కి వెళ్లిన అమ్మాయిలను షార్క్ చేపలు టార్గెట్ చేస్తాయి. ఒక్కొక్కరిని భయంకరంగా వెంటాడుతాయి. మొదట సరదాగా మొదలయ్యే ఈ సినిమా, స్టోరీ నడిచే కొద్దీ సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
’47 మీటర్స్ డౌన్: అన్‌కేజ్డ్’ 2019లో వచ్చిన అమెరికన్ సర్వైవల్ హారర్ సినిమా. జోహాన్నెస్ రాబర్ట్స్ దీనిని డైరెక్ట్ చేశాడు. ఇందులో సాఫీ నెలిస్సే (మియా), కోరిన్ ఫాక్స్ (సాషా), బ్రియాన్ ట్జూ (లెయినా), సిస్టీన్ స్టాలోన్ (నికోల్) మెయిన్ రోల్స్ లో నటించారు. ఈసినిమా 2019 ఆగస్టు 16న థియేటర్లలో రిలీజ్ అయింది. 1 గంట 29 నిమిషాల రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
మెక్సికోలో మియా అనే అమ్మాయి మోడిన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుంటుంది. ఆమె తన స్టెప్ సిస్టర్ సాషాతో కలిసి ఉంటుంది. కానీ వాళ్ల మధ్య పెద్దగా బాండ్ ఉండదు. స్కూల్‌లో మియానిని కొంత మంది ఏడిపిస్తుంటారు. సాషా హెల్ప్ చేయకుండా ఆమెను ఇగ్నోర్ చేస్తుంది. దీంతో మియా హర్ట్ అవుతుంది. సాషా తన ఫ్రెండ్స్ నికోల్, లెయినా, కాథరిన్ తో కలిసి సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. మియా కూడా వాళ్ళతో జాయిన్ అవుతుంది. అయితే ఇంట్లో వాళ్ళకి తెలీకుండా నికోల్ ఒక సీక్రెట్ డైవింగ్ ట్రిప్‌కి ఒప్పిస్తుంది. ఒక మాయన్ సిటీని ఎక్స్‌ప్లోర్ చేయడానికి తెసుకెళ్తుంది. బెంజమిన్ అనే గైడ్ వాళ్లను ఒక కేవ్‌లోని అండర్‌వాటర్ సిటీకి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్లను షార్క్స్ అటాక్ చేస్తాయి.
డైవ్ చేసిన కొద్దిసేపటికే షార్క్స్ వాళ్లను చుట్టుముట్టేస్తాయి. వాళ్లు ఒక కేవ్ లోపల చిక్కుకుంటారు. ఆక్సిజన్ ట్యాంక్స్ తక్కువగా ఉంటాయి. ఇక షార్క్స్ ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలీదు. ఇప్పుడు మియా, సాషా మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. మియాని సాషా ఇగ్నోర్ చేసినందుకు కోపంగా ఉంటుంది. మరోవైపు నికోల్ రిస్కీ డెసిషన్స్ తీసుకుంటుంది. దీంతో గ్రూప్ మరింత డేంజర్‌లో పడుతుంది. వాళ్లు కేవ్‌లో నారో టన్నెల్స్‌లో క్రాల్ చేస్తూ ఎస్కేప్ రూట్ వెతుకుతారు. ఒక షార్క్ కాథరిన్‌ని అటాక్ చేస్తుంది. ఆమె తీవ్రంగా గాయపడుతుంది. బెంజమిన్ గైడ్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ షార్క్ అతన్ని కూడా బైట్ చేస్తుంది.
ఇక ఈ గ్రూప్ కి ఆక్సిజన్ లాస్ట్ అవుతుంటే, కేవ్‌లో ఎయిర్ బబుల్స్ వెతుకుతారు. దొరక్కపోవడంతో నికోల్ ఒక టన్నెల్‌లో ఒంటరిగా బయటికి వెళ్ళడానికి ట్రై చేసి, ఒక షార్క్‌కి బలైపోతుంది. కాథరిన్ ఆక్సిజన్ లాస్ట్ అయి చనిపోతుంది. ఇక మియా, సాషా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయట పడటానికి ప్రయత్నిస్తారు. కథ మరో ప్రమాదంలోకి టర్న్ తీసుకుంటుంది. ఈ ప్రమాదం నుంచి వీళ్ళు బయట పడతారా ? వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారా ? అనే విషయాలను, ఈ సర్వైవల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ