BigTV English

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Ravi Teja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా… స్పెయిన్ షెడ్యూల్‌తో ఫైనల్ టచ్

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదలవుతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.


కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లానింగ్ లో ఉంది. దర్శకుడు కిషోర్ తిరుమల కి కూడా తన కెరియర్ లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రాలహరి వంటి సినిమాలు కిషోర్ తిరుమల కి దర్శకుడుగా మంచి పేరును తీసుకొచ్చాయి. ముఖ్యంగా కిషోర్ తిరుమల రైటింగ్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కానుకగా రవితేజ సినిమాను దించే ప్లానింగ్ లో ఉంది చిత్ర యూనిట్.

స్పెయిన్ లో ఫైనల్ టచ్ 

రవితేజ – కిషోర్ తిరుమల మూవీ టీమ్ ఈ వీకెండ్ Spain వెళ్తున్నారు. 26 వరకు అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 10 రోజుల టాకీ, రెండు పాటల షూట్. ఈ షెడ్యూల్ తో ఒక సెట్ పాట తప్ప మొత్తం షూట్ పూర్తయిపోయినట్లే.


ఇకపోతే ఈ సినిమా రవితేజ కెరీర్ లో వస్తున్న 76వ సినిమా. ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ దీని గురించి ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజను చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. ఇదివరకే ఈ సినిమా నుంచి ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 

సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి చాలామంది దర్శకులు సినిమాలో ఫ్యామిలీ టచ్ ఉండేలా ప్లాన్ చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాకి సంబంధించి కూడా కంప్లీట్ ఫ్యామిలీ టచ్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు బివిఎస్ రవి కథను అందించారు. రవితేజకు జంటగా మామితా బైజు (Mamitha Baiju), కయాదు లోహర్ (Kayadu Lohar) నటిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో రవితేజ నటించిన ధమాకా సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు ఈయన. ధమాకా సినిమా తర్వాత రవితేజకు ఆ స్థాయి సక్సెస్ రాలేదు. మరోవైపు కిషోర్ తిరుమల చివరి సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

Also Read: Anaganaga Oka Raju : గోదావరి స్టైల్‌లో దసరా విషెస్… నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో వైరల్

Related News

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Samantha: పండగపూట గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. విడాకుల తరువాత ఇలా!

Kanatara 1 – Prabhas:  కాంతార1 కు కల్కి రివ్యూ.. మరింత హైప్ ఇచ్చాడుగా!

Kantara 1 Remuneration:  కాంతార1 రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యూనరేషన్ .. ఎవరికి ఎంతంటే?

Anaganaga Oka Raju : గోదావరి స్టైల్‌లో దసరా విషెస్… నవీన్ పోలిశెట్టి ఫన్నీ వీడియో వైరల్

MSVPG : చాలా ఏళ్ల తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్… మెగాస్టార్ పాటలో మ్యాజిక్ రిపీట్

Little Hearts 2 : లిటిల్ హార్ట్స్ 2 ప్రకటించిన డైరెక్టర్.. హీరో హీరోయిన్లు మారిపోయారా?

Big Stories

×