Healthy Heart secrets| శరీరంలోని అన్నిభాగాలను రక్తాన్ని సరఫరా చేస్తుంది హృదయం (గుండె). ఆ రక్తంలోనే ఆక్సిజన్, పోషక విలువలు ఉంటాయి. అంతేకాదు రక్తంలో వ్యర్థాలను తొలగించి శుద్ధి చేస్తుంది. అందుకే హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కానీ సరైన జీవనశైలి లేక చాలామంది తక్కువ వయసులో గుండె పోటు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా 102 సంవత్సరాల వయసు ఒక వ్యక్తి గుండె చాలా బలంగా, ఆరోగ్యకరంగా పనిచేస్తోంది. ఆ వ్యక్తి పేరు డాక్టర్ జీపీ సేథ్.
70 సంవత్సరాలుగా జీపీ సేథ్ జీవినశైలి, మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఈ లేటు వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం వెనుక మరో బలమైన కారణం ఆయన భార్య ఒక డైటీషియన్ కావడం. ఆయన కొడుకు అశోక్ సేథ్ (70) ఒక సీనియర్ కార్డియాలజిస్ట్. డాక్టర్ అశోక్ తన తండ్రి హృదయ ఆరోగ్య రహస్యాలను బయపెట్టారు. జీపీ సేథ్ అదృష్టంతో కాదు, కష్టపడి ఆరోగ్యవంతమైన గుండెని సాధించారని చెప్పారు. రోజూ వ్యాయామం, మంచి పోషకాలతో సమతులంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆయన శరీరం బలంగా ఉంది అని డాక్టర్ అశోక్ వివరించారు.
ఆరోగ్యవంతమైన గుండె దీర్ఘాయుష్షును నిర్ధారిస్తుంది. ఇది ఏ వయసులోనైనా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. రెగ్యులర్ వ్యాయామం వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. 102 ఏళ్ల జీపి సేథ్ ఈ విషయాన్ని నిరూపించారు. అందుకే మీ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. ఇప్పుడే జీవనశైలిలో మార్పులు చేయండి.
రోజూ నడక లేదా యోగా వంటి సులభ వ్యాయామం చేయండి. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తినండి. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయండి. ఈ అలవాట్లు హృదయాన్ని బలపరుస్తాయి. స్థిరమైన ప్రయత్నంతో ఫిట్‌నెస్ సులభం.
వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుంది. గుండె బాగా పనిచేస్తుంది. ఆక్సిజన్ ఇతర అవయవాలకు చేరుతుంది. బలమైన గుండె ఉంటూ శరీరం కూడా బలంగా తయారవుతుంది. అలసట తగ్గుతుంది. చురుకుగా ఉంటారు. రెగ్యులర్ వ్యాయామం గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్, స్ట్రోక్ రిస్క్‌లు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మూడ్‌ను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన, విచారం తగ్గుతాయి. ఆరోగ్యకరమైన గుండె సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది.
రంగురంగుల ఆహారాలు (స్పినాచ్, ఆపిల్) తినండి. జంక్ ఫుడ్ అలవాట్లు మానుకోండి. నీరు బాగా తగాలి. సిట్రస్ ఫలాలు తింటే మెదుడు కూడా చురుకుగా ఉంటుంది. రికవరీ కోసం నిద్ర అవసరం. ఆరోగ్యం కోసం సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెక్-అప్ చేసుకోండి.
వయసు గుండె ఆరోగ్యానికి అడ్డు కాదు. రోజూ వ్యాయామం చేయండి. ఆహారం, యాక్టివిటీ సమతుల్యంగా ఉంచండి. ఒత్తిడిని ఆరోగ్యకర అలవాట్లతో తగ్గించండి. 102 ఏళ్ల జీపీ సేథ్ వ్యక్తి అందరికీ స్ఫూర్తి. దీర్ఘకాల జీవితం కోసం ఈ ఆరోగ్య సలహాలను పాటించండి.
Also Read: అత్యంత వృద్ధ మహిళ డిఎన్ఏలో షాకింగ్ రహస్యాలు.. ముసలితనంలోనూ యవ్వనంగా