MP Tractor Accident: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
నిమజ్జనం సమయంలో ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో యువతులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 30 నుంచి 32 మంది ఉన్నట్లు సమాచారం.
ఖాండ్వా జిల్లా పంధానాలోని అర్దాలా గ్రామంలో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాక్టర్ పై విగ్రహాన్ని చెరువు వద్దకు తీసుకెళ్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తా పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రక్ లో ఉన్న వారు నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు స్పందించి జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. స్థానికులు 11 మందిని రక్షించారు. మిగతా వారికోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
విజయదశమి నాడు దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ జమాలి సమీపంలోని అబ్నా నదిలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు మునిగిపోయారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓపీ జుగ్తావత్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా విషాదకరమైన సంఘటన. పంధాన ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడి దాదాపు 10 మంది మరణించారు. గాయపడిన వారిని పంజానా ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని ఖాండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 30 నుండి 32 మంది ఉన్నారని తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరగవచ్చు. ఎస్పీ, ఆరోగ్య బృందంతో సహా జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉన్నారు’ అని అన్నారు.
ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన తర్వాత అందులో ఉన్న వారు సహాయం కోసం కేకలు వేశారని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. నిమజ్జన వేడుక కోసం చెరువు వద్ద ఎక్కువ మంది ఉండటంతో వాళ్లు వెంటనే స్పందించి కొంతమందిని రక్షించారు. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది గల్లంతయ్యారు. 10 మంది మృతదేహాలు వెలికితీశారు.
Also Read: MP Couple Buries Child: కన్నబిడ్డను సజీవ సమాధి.. ఉద్యోగం కోసం తల్లిదండ్రులు దారుణం
సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు.