RGV vs RRR : ప్రస్తుతం ఫామ్ లో లేరు కానీ దర్శకులకి కూడా ఫ్యాన్స్ ఉంటారు అని ప్రూవ్ చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. మామూలుగా తెరమీద హీరోలు మాత్రమే కనిపించే వాళ్ళు. రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దర్శకులకు కూడా ఫ్యాన్స్ ఉండడం మొదలుపెట్టారు. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వర్మ మొదటి సినిమాతోనే తెలుగు రాష్ట్రాలలో సంచలనం క్రియేట్ చేశాడు.
ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి వచ్చిన శిష్యులే. ఎస్.ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డివంగా వంటి దర్శకులు కూడా ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ అని అభిమానిస్తారు. అలానే రాంగోపాల్ వర్మ బెస్ట్ వర్క్ ఎవరు చేసినా కూడా పిలిచి అభినందిస్తాడు. రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ సినిమాల కంటే కూడా ఇంటర్వ్యూలు బాగా ఫేమస్ అవుతున్నాయి. పొలిటిషన్ రఘురామకృష్ణం రాజుతో రాంగోపాల్ వర్మ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాటిలో చాలా ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు.
రఘు రామ కృష్ణం రాజు రాంగోపాల్ వర్మతో మాట్లాడుతూ… మీరు కొన్ని విషయాలు చెప్తారు అవి మీకు సూట్ అయినట్లు, మీ ఫాలోవర్స్ కి ఎలా సూట్ అవుతాయని ప్రశ్నించారు.
రామ్ గోపాల్ వర్మ సమాధానంగా.. మనం మాట్లాడే కారణం ఏంటి అంటే అవతలవాడు వినడానికి మాట్లాడుతాం. లేకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ట్విట్టర్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏదైనా పెట్టినప్పుడు ఒకరికో ఇంట్లో పదిమందికో చెప్పకుండా నేను చాలామంది మిలియన్స్ తో చెప్పాలి అనుకుంటాను. వాళ్లలో ఎవరు కనెక్ట్ అవుతారో, ఎవరు కరెక్ట్ గా తీసుకుంటారు, ఎవరు వెక్కిలి చేస్తారో, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.
నేను పెళ్లి గురించి కామెంట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా బుర్ర ఉండే వింటే. కష్టాలు పడకుండా ఉండడానికి నేను సలహాలు ఇస్తున్నాను. నేను విపరీతంగా ఇక్కడే ప్రజా సేవ చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నాను అంటూ ప్రజానాయకుడు ముందే మాట్లాడాడు.
దీనికి రఘురామకృష్ణం రాజు తిరిగి మాట్లాడుతూ మీ మాటల వలన చాలామంది పెళ్లి చేసుకోక పోతే ఎలా అన్నప్పుడు. రామ్ గోపాల్ వర్మ ఫెడ్రిక్ నిషే చెప్పిన ఫిలాసఫీ చెప్పాడు. నేను అన్న దానికి నువ్వు ఒప్పుకుంటే ఆల్రెడీ నీకు ఆ విషయం తెలుసు అని అంటూ ఫిలాసఫీ చెప్పాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఏది ఒప్పుకోరు. అంటూ మరోసారి తన ఆలోచనలతో రఘురామకృష్ణం రాజుని సందిగ్ధంలో పడేశాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో పొలిటికల్ టాపిక్స్ గురించి ఎక్కువ చర్చలు జరిగాయి.
Also Read: Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే