E-Paper
Advertisement

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్, లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Advertisement

Ram Charan : మెగాస్టార్ తనయుడుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనే పేరుని నిలబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అచీవ్ చేసినవి మామూలు రికార్డ్స్ కాదు. అలానే ఏ పొరపాటు చేసినా కూడా మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఇలా చేశాడు అని బయట మాట్లాడుకోవడం మొదలుపెడతారు.

చరణ్ మాత్రం చిరంజీవి పేరుకి కొంచెం కూడా డ్యామేజ్ కలగకుండా, ఒక వైపు సినిమాలు చేస్తూనే వ్యక్తిగతంగా కూడా తనకంటూ కొంత ఆత్మీయులను సంపాదించుకున్నారు. సినిమాలు బాగుంటే అభిమానులు వస్తారు. కానీ వ్యక్తిత్వం బాగుంటేనే ఆత్మీయులు ఉంటారు. వాళ్లకు హిట్టు ప్లాప్ తో సంబంధం ఉండదు. చరణ్ అది సాధించాడు అని చెప్పాలి.

ఆర్చరీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్

Advertisement

ఆర్చరీ లీగ్ 2025 అక్టోబర్ రెండు నుంచి మొదలైంది. ఇది అక్టోబర్ 12 వరకు జరగనుంది. ఈ లీగ్ న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 6 జట్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. మొత్తం 36 మంది భారతీయులు మరియు 12 మంది విదేశీ ఆర్చర్లు టోటల్గా 40 ఎనిమిది మంది పాల్గొననున్నారు. ప్రతి టీం లో 8 మంది ఉంటారు. నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉంటారు. ఈ లీగ్ ను గోబెల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫోటోలు వైరల్ గా మారాయి.

షాకింగ్ లుక్ 

Advertisement

ఈ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైన రామ్ చరణ్ అందరి కళ్ళను తన వైపు తిప్పేసుకుంటున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లాంగ్ హెయిర్ తో రా అండ్ రస్టిక్ గా చరణ్ కనిపించనున్నాడు. సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోయినా కూడా ఇలాంటి ప్రారంభోత్సవాలకు హాజరైనప్పుడు అభిమానులు కూడా చాలా సంతోషపడతారు.

తమ అభిమాన హీరోని పదే పదే చూసే అవకాశం కూడా దక్కుతుంది. మొత్తానికి రామ్ చరణ్ వీడియోలు చూసి చాలామంది తన ఆరా గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆర్చరీ విషయానికి వస్తే రామ్ చరణ్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ (RRR Movie) సినిమాలో బాణాలు వదిలే విధానం ఒక హై ఇస్తుంది. ప్రస్తుతం ఆ సినిమాలోని ఫోటో కూడా వైరల్ గా మారింది. ఏదేమైనా తమ అభిమాన హీరో ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అని తెలిసినప్పుడు ఫ్యాన్స్ తమ ఎడిట్స్ తో రెడీగా ఉంటారు.

Also Read: Bigg Boss Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×