Kanatara 1 – Prabhas: రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయదర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). కాంతార సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. నిన్న సాయంత్రం నుంచి ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని ప్రాంతాలలో కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు ఎన్టీఆర్ సైతం ఈ సినిమా గురించి స్పందిస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని రిషబ్ తన నటనతో అదరగొట్టాడు అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇక కాంతార సినిమాకు ఎన్టీఆర్ కూడా పెద్ద ఎత్తున సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇకపోతే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సైతం కాంతార సినిమా పట్ల తన అభిప్రాయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఈ సినిమాపై స్పందిస్తూ…
“కాంతార చాప్టర్ 1 సినిమా అద్భుతమైన ప్రదర్శనలతో కూడిన గొప్ప చిత్రం. ఈ ఏడాదిలో ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్. రిషబ్ శెట్టి విజయ్ కిరంగదుర్ అలాగే హోంభళే ఫిలిప్స్ కు అభినందనలు” అంటూ ఈయన తన అభిప్రాయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇలా ప్రభాస్ కాంతార 1 సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా తన వంతు సాయం చేశారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషలలో స్టార్ హీరోల చేత విడుదల చేయించిన సంగతి తెలిసిందే.
రిషబ్ నటనకు నేషనల్ అవార్డు..
ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ ప్రభాస్ విడుదల చేశారు.. ఇలా ఈ సినిమా కోసం ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు రంగంలోకి దిగడంతో సినిమా పట్ల తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రిషబ్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ కాంతార సినిమాలతో కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక కాంతార సినిమాలో రిషబ్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రీక్వెల్ సినిమాలో రిషబ్ నటన విశ్వరూపానికి ఎలాంటి అవార్డులు వరిస్తాయో వేచి చూడాలి. ఇక ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది.
Also Read: Kantara 1 Remuneration: కాంతార1 రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యూనరేషన్ .. ఎవరికి ఎంతంటే?