OTT Movie : పెళ్ళాం ఉండికూడ మరొకరితో అఫ్ఫైర్ పెట్టుకునే మగవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్. ఈ సినిమాలో హీరో ఎక్కడికి వెళ్ళినా ఒక అమ్మాయితో అఫ్ఫైర్ నడుపుతుంటాడు. అయితే ఒకరికి తెలీకుండా ఒకరితో గడుపుతూ జాగ్రత్త పడుతుంటాడు. ఒక్క సారిగా అతని సీక్రెట్స్ బయట పడటంతో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. అమ్మాయిలంతా కలసి తీర్చుకునే రివేంజ్ కి హీరోకి చుక్కలు కనబడుతుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది అదర్ వుమన్’ 2014లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. దీనికి నిక్ కాసవెట్స్ దర్శకత్వం వహించారు. ఇందులో క్యామెరాన్ డియాజ్ (కార్లీ), లెస్లీ మాన్ (కేట్), కేట్ అప్టన్ (అంబర్), నికోలాజ్ కోస్టర్-వాల్డావ్ (మార్క్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. 1 గంట 49 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కార్లీ అనే అమ్మాయి న్యూయార్క్‌లో ఒక కాన్ఫిడెంట్ లాయర్. ఆమె మార్క్ అనే హ్యాండ్సమ్ బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ రొమాన్స్ సూపర్ హిట్ అవుతుంది. కానీ ఇంతలోనే కార్లీకి ఒక షాక్ తగులుతుంది. మార్క్‌కి ఇప్పటికే పెళ్లైందనే విషయం తెలిసి, ఆమె ఒక్క సారిగా డీలా పడిపోతుంది. ఆ తరువాత అతని వైఫ్ కేట్ ని పరిచయం చేసుకుంటుంది. కార్లీ మార్క్ కి బుద్ధి చెప్పాలనుకుంటుంది. కేట్‌ని సీక్రెట్‌గా మీట్ అవుతుంటుంది. కేట్ ఒక హౌస్‌వైఫ్, మార్క్‌తో హ్యాపీ మ్యారేజ్ ఉందని అనుకుంటుంది. కానీ అతని అఫైర్ గురించి తెలిసి ఆమె కూడా బ్రేక్‌డౌన్ అవుతుంది. కార్లీ, కేట్ ఈ విషయం మీద మొదట గొడవపడతారు. కానీ మార్క్ చీటింగ్ గురించి మాట్లాడుకుని ఫ్రెండ్స్ అవుతారు. కార్లీ, కేట్ మార్క్‌ని వాచ్ చేస్తూ, అతనికి అంబర్ అనే మరో గర్ల్‌ఫ్రెండ్ ఉందని తెలుసుకుంటారు. అంబర్ ఒక యంగ్, సెక్సీ మోడల్, మార్క్‌తో బీచ్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటుంది.
ఇక దొరికిందే సందు అన్నట్లు కార్లీ, కేట్ అంబర్‌ని మీట్ అవుతారు. మొదట ఆమెను తప్పుగా అనుకుంటారు, కానీ అంబర్ ని కూడా మార్క్ చీటింగ్ చేశాడని తెలుసుకుని షాక్ అవుతారు. అంబర్ కూడా చాలా బాధపడుతుంది. ఇక ఈ ముగ్గురూ మార్క్‌పై రివెంజ్ ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ లో భాగంగా, మార్క్‌ని పబ్లిక్‌గా ఎంబారస్ చేయడం, అతని బిజినెస్, రెప్యూటేషన్ డౌన్ చేయడం, మార్క్ ఫోన్ హ్యాక్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఒక రోజు మార్క్ బిజినెస్ ట్రిప్‌కి బహామాస్ వెళ్తాడు. కార్లీ, కేట్, అంబర్ అతన్ని ఫాలో చేస్తారు. అక్కడ మార్క్ బిజినెస్ డీల్స్‌లో చీటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముగ్గురూ మార్క్ బిజినెస్ సీక్రెట్స్ లీక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. చివర్లో ఈ ముగ్గురూ మార్క్ స్కామ్ డీటెయిల్స్ బయట పెడతారు. దీంతో అతని బిజినెస్ పార్టనర్స్ షాక్ అవుతారు. ఇక ఈ ముగ్గురూ అతని మొహం మీదే నీవు చీటర్ అని చెప్పి వెళ్లిపోతారు. ఇప్పుడు మార్క్ ఒంటరిగా మిగులుతాడు. ఈ కథ ఇలాంటి షాకింగ్ ట్విస్టులతో ముగుస్తుంది.
Read Also : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ