BigTV English

Shivalinga : ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు కానీ…

Shivalinga : ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు కానీ…
Shivalinga

Shivalinga : మహాశివుడిని ఆరాధిస్తే తీరని కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. లింగాల్లో అతిశక్తివంతమైంది స్పటిక లింగం. సంపదకు, ఆనందానికి ప్రతిరూపం శివుడి స్పటిక లింగం. ఈ లింగాన్ని రకరకాలుగా పూజలు చేయవచ్చు.స్పటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకిస్తే పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యు భయం పోతుంది. ఆవుపాలతో అభిషేకిస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో చేస్తే బలం, కీర్తి ప్రఖ్యాతలు కలుగుతాయి. చెరుకు రసంతో పూజిస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దు:ఖం ఉండదు. మారేడు పత్రాలతో పూజిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. తేనెతో అభిషేకిస్తే ఆయుష్సు పెరుగుతుంది. పూలతో ఉన్న నీటితో చేస్తే భూ లాభం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి.


శివుడికి అలంకరణ కంటే అభిషేకం చాలా ఇష్టం. అందుకే నిత్యం దేవాలయాల్లో శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో మాత్రం శివుడి చిత్ర పటాలను పెట్టి పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనూ శివలింగాన్ని పూజిస్తే అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శివలింగానికి పూజ చేయాలనుకునేవారు స్పటిక లింగాన్ని తెచ్చుకోవాలని అంటున్నారు. స్పటిక లింగాభిషేకం ద్వారా ఐశ్యర్యంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందట. అభిషేకం అనంతరం పువ్వులతో అలకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలని అలా ప్రతి రోజు స్పటిక లింగాన్ని పూజిస్తే సమస్త పాపాలుతొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

కేవలం శివరాత్రి రోజు మాత్రమే కాకుండా వీలైతే ప్రతీ సోమవారం ఇలాంటి అభిషేకాలు చేయడం వల్ల ప్రతిఫలం ఉండొచ్చు. శివుడి అనుగ్రహం ఉంటే ఇంట్లోనెగెటివ్ ఎనర్జీ పోతుందటని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా జీవిస్తారని తెలుపుతున్నారు. కొంతమందికి ఇంట్లో అసలు శివలింగాన్ని పెట్టకూడదన్నసందేహాలు వస్తుంటాయి. కానీ లింగాన్ని పెట్టుకోవచ్చు. ఇంటి యజమాని బొటన వేలులో మొదటి కణుపు సైజు వరకు ఉన్నశివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజలు చేయవచ్చు. అందులో ఎలాంటి తప్పు ఉండదు.


Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×