IND Vs PAK : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ పహల్గామ్ ఉగ్రదాడిని, ఆపరేషన్ సింధూర్ ని గుర్తు చేస్తూ.. పిచ్చి పిచ్చి సైగలు చేశాడు. తాజాగా బుమ్రా 17.5 ఓవర్ లో హారిస్ రవూఫ్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఇటీవల చేసిన ఓవరాక్షన్ కి బుమ్రా తాజాగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. హారిస్ రవూఫ్ చేసిన మాదిరిగానే సైగలు చేసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రవూఫ్ నుక్లీన్ బౌల్డ్ చేసిన తరువాత జెట్ కూలిపోయింది అన్నట్టు బుమ్రా సైగలు చేస్తూ.. సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : IND VS PAK Final : 4 వికెట్లతో కుల్దీప్ రచ్చ…జెట్స్ లాగా కుప్పకూలిన పాక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 146 పరుగులు చేసింది. ప్రారంభంలో ఓపెనర్ ఫర్హాన్, ఫకర్ జమాన్ విజృంభించడంతో తొలుత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 9.4 ఓవర్ వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఫర్హాన్ 38 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత ఫకర్ జమాన్ ఆ తరువాత ఫకర్ జమాన్ క్రీజులోనే ఉండి 46 పరుగులు చేశాడు. అతను ఉన్నంత సేపు టీమిండియా కి చుక్కలు చూపించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఫకర్ జమాన్ ఔట్ కావడంతో పాకిస్తాన్ వికెట్ల పతనం మొదలైంది.
Also Read : IND Vs PAK : అర్ష్ దీప్ సింగ్ పై బ్యాన్…సరికొత్త కుట్రలకు తెగించిన పాకిస్థాన్..!
పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ కి టీమిండియా స్పీడ్ బౌలర్ బుమ్రా కి మాటల యుద్ధం జరిగింది. ఈ సీజన్ లో బుమ్రా బౌలింగ్ లో ఫర్భాన్ 3 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. వాస్తవానికి బుమ్రా బౌలింగ్ లో ఎవ్వరైనా సిక్స్ లు కొట్టాలంటే జంకుతారు. బంతిని టచ్ చేయలేకపోతుంటారు. అలాంటిది ఫర్హాన్ బుమ్రా బౌలింగ్ లో బాదడం అంటే మామూలు విషయం కాదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 57, ఫకర్ జమాల్ 46, సయిమ్ అయూబ్ 14, హారిస్ 0, సల్మాన్ అఘా 8, హుస్సెయిన్ తలాత్ 1, మహ్మద్ నవాజ్ 6, హారిస్ రవూఫ్ 6, అబ్రార్ 1 పరుగు చేశారు. ప్రారంభంలో పరుగులు సమర్పించుకున్న బుమ్రా 2, కుల్దీప్ యాదవ్ 4, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2 చొప్పున వికెట్లు తీశారు. దీంతో పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్ లో 146 పరుగులు చేసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు కాస్త తడబడినట్టు కనిపించడం గమనార్హం.
Bumrah giving it back to Haris Rauf 💀#JaspritBumrah #INDvsPAK #AsiaCupFinal pic.twitter.com/24XDailRiw
— Deepu (@deepu_drops) September 28, 2025