BigTV English

Bigg Boss Buzzz : ప్రియా శెట్టిని కడిగిపడేసిన శివాజీ, నోరు తెరవనివ్వకుండా కౌంటర్లు

Bigg Boss Buzzz : ప్రియా శెట్టిని కడిగిపడేసిన శివాజీ, నోరు తెరవనివ్వకుండా కౌంటర్లు

Bigg Boss Buzzz : బిగ్ బాస్ సీజన్ 9 నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా శివాజీ బిగ్ బాస్ లో ఉన్నందువలన ఆ బాధ్యతను శివాజీకి అప్పచెప్పారు. దానికంటే ముందు కోర్టు అనే సినిమాలో మంగపతి అనే క్యారెక్టర్ శివాజీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది. ఆ పాత్ర రావడానికి కారణం కూడా ఒకరకంగా బిగ్ బాస్ అని చెప్పాలి.


బిగ్ బాస్ షోలో ఒకప్పుడు శివాజీ కూడా బాగా హైలైట్ అయ్యారు. బహుశా అది చూసే దర్శకుడికి మంగపతి క్యారెక్టర్ లో శివాజీని పెట్టాలి అనే ఆలోచన కూడా వచ్చి ఉండవచ్చు. ఇక రీసెంట్ గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

ప్రియా శెట్టిని కడిగి పడేసిన శివాజీ 

ప్రియా శెట్టి ఎంట్రీ ఇవ్వగానే ప్రియా శెట్టి ఎదురుగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు శివాజీ. వెంటనే ఇలా కూర్చుంటే బాలేదు కదా అని ప్రియాను అడిగారు. దానికి ప్రియా కూడా బాలేదు సార్ అని చెప్పింది. వెంటనే బిగ్ బాస్ లో ప్రియా శెట్టి, హరీష్, కళ్యాణ్ కూర్చున్న ఫోటోను చూపించారు.


ఫోటోను చూపించి అక్కడ అందరూ ఎలా కూర్చున్నారు మీ ముగ్గురు ఎలా కూర్చున్నారు అని ప్రశ్నించారు.? అలా మీరు నాగర్జున గారి ముందు కూర్చోకపోయిన ఆడియన్స్ ముందు కూర్చున్నట్లే అని క్లారిటీ ఇచ్చారు.

మీరేమో మాట్లాడితే కామనర్స్, సెలబ్రిటీస్ అని టాపిక్స్ తీస్తారు. అగ్నిపరీక్షలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు, షోలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు? మొత్తం కలిసి రెండు నెలలు ఉన్నాము అని ప్రియా శెట్టి చెప్పగానే, ఇప్పుడు మీరు సెలబ్రిటీ కాదా అని తిరిగి ప్రశ్నించారు.

మీరు సెలబ్రిటీ కాదు అనుకుని ఇలా బిహేవ్ చేశారంటే, ఒకవేళ సెలబ్రిటీ అయితే ఇంకెలా బిహేవ్ చేస్తారు అని ప్రశ్నించారు. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారు.? విన్ అవ్వాలి అని ప్రియా శెట్టి చెప్పగానే. విన్ అవ్వడం కోసం అసలు ఏం చేశారు అని తిరిగి ప్రశ్నించాడు శివాజీ.

ప్రియా కి కంప్లైంట్ చేయడం మాత్రమే తెలుసు, ఆట ఆడటం రాదు. ఇక్కడ బానే వింటున్నారు హౌస్ లో మాత్రం ఎందుకు ఏమీ వినలేదు. ఎవరిని చెప్పనివ్వకుండా నోరు వేసుకొని అందరి మీద పడిపోయారు మీరు. అందరినీ నువ్వు తొక్కడం మొదలు పెట్టావు వాయిస్ తో, నువ్వు మాట్లాడకుండా ఉండు అని ఆడియన్స్ ఫీలయ్యారు. అంటూ ప్రియా పూర్తిగా కడిగి పడేశారు.

Related News

Bigg Boss 9 : ట్విస్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ తో కలర్ ఫుల్ దసరా ఎపిసోడ్

Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?

Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

Bigg Boss 9 : ఫ్యూజ్ లు ఎగిరిపోయే వార్నింగ్ లు, సరికొత్త టాస్కులు, మరికొన్ని ట్విస్టులు 

Bigg Boss 9: కంటెస్టెంట్స్ కి రియల్ అగ్ని పరీక్ష.. సంజన కోసం ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. తనూజ కాఫీ.. త్యాగం

Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది

Big Stories

×