AP Ministers: ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కృష్ణబాబు, కన్నబాబు దక్షిణ కొరియాలో పర్యటించారు. దక్షిణ కొరియా రాజధాని సీయోల్ నగరం మధ్యలో ప్రవహించే “హన్” నది, పరిసర ప్రాంతాలను మంత్రుల బృందం పరిశీలించింది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ అభివృద్ధిలో కీలకంగా మారి, నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణ అందిస్తూ, పర్యాటకులను ఆకర్షించడంలో హన్ నది ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సైతం ఇటువంటి ఆహ్లాదకర వాతావరణం కల్పించే కోణంలో హన్ నది తీర ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు పరిశీలించారు. హన్ నది పరివాహక ప్రాంతంలో అనేక పార్కులు, వంతెనలు, సైకిల్ మార్గాలు వంటి అభివృద్ధి నిర్మాణాలతో పాటు ఆధునిక రాజధానులకు సరికొత్త రూపంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిలుస్తుంది.
కృష్ణానది తీరంలో అమరావతి రాజధాని నిర్మిస్తున్న క్రమంలో హన్ నది.. తరహాలో ఆధునిక రాజధాని నిర్మాణాన్ని కృష్ణా తీరంలో అభివృద్ధి చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. ఆధునిక నగర వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, నగర పౌరులకు సరికొత్త అనుభూతులను కల్పిస్తూ, వినోదం, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా హన్ నదీ తీర ప్రాంతం అభివృద్ధి చెందింది.
Also Read: GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?
రాష్ట్రంలో సైతం నది తీర ప్రాంతాల్లో ఆహ్లాదకర, పర్యాటకులను ఆకర్షించే వాతావరణం కల్పించడం ద్వారా టూరిజం రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.